బాలయ్య 'కామన్ డీపీ' మామూలుగా లేదుగా.. అప్పుడే మొదలెట్టేసిన ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ అంటే తెలియని తెలుగువాడు ఉండడు. తండ్రి వారసుడిగా సినీరంగంలో ప్రవేశించిన ఆయన తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. ఆయన తొడ కొడితే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే మీసం మెలేస్తే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. జూన్ పదో తేదీన ఆయన పుట్టినరోజు ఉండడంతో ఇప్పటి నుంచే ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే ఆయన నటిస్తున్న అఖండ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఇప్పుడు కొత్తగా ఆయన కామన్ డీపీ కూడా రిలీజ్ అయింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామన్ డీపీ లు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా బాలకృష్ణ కామన్ డీపీని నారా రోహిత్ విడుదల చేశారు. బాలకృష్ణ హెలికాప్టర్ నుంచి దిగుతున్నట్లుగా ఉన్నట్టు ఈ కామన్ డీపీని రిలీజ్ చేశారు. ఇక ఈ ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ లో సింహం గాండ్రిస్తున్నట్టుగా ఉన్న ఫోటో అలాగే ఒక రాజ మహల్ లాంటి కోట, బాలకృష్ణ సంతకం కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి ''కామన్ డీపీ బాలకృష్ణ మామ పుట్టిన రోజున సందర్భంగా లాంచ్ చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నానని ఈ డీపీని ఎంత స్టైలిష్ గా తయారు చేసినందుకు అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అని నారా రోహిత్ చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు, నటులు, కొంతమంది దర్శక నిర్మాతలు సైతం బాలకృష్ణ కామన్ డీపీని షేర్ చేస్తున్నారు. ఇక బాలయ్య ఫాన్స్ అయితే అగుతారా, ఇప్పటికే ఈ కామన్ డీపీని సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు. ఇక ప్రతి యేటా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండేవి. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా అభిమానులు జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ ఒక సందేశం కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











