మన హీరోస్ కి 'దారే లేదా' అంటున్న నాని.. చెప్పినట్టుగానే వచ్చేస్తున్నాడు!
ఈ కరోనా కాలంలో మన సినిమా వాళ్లు కూడా వీలైనంత సహాయం చేస్తూ కరోనా బాధితులకు అలాగే సాధారణ ప్రజలకు కరోనా మీద కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి మొదలు రామ్ చరణ్ భార్య ఉపాసన వరకు పలు లఘు చిత్రాలు చేసే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వాళ్ల సంగతి తెలియదు కానీ నాచురల్ స్టార్ నాని మాత్రం కొద్ది రోజుల క్రితం ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నానని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు ఆయన.
దీనికి సంబంధించి తనకు ఒక ఐడియా మాత్రమే ఉండేదని కానీ ఇప్పుడది నిజమైందని చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా ఈ పాట కోసం పనిచేసిన నటుడు సత్యదేవ్ నటి రూపా కొడువాయూర్, అలాగే సంగీత దర్శకుడు విజయ్, అలాగే లిరిసిస్ట్ కేకే, మదన్ కార్కే, లహరి మ్యూజిక్ అలాగే చాయ్ బిస్కెట్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ వీడియోకి తెలుగులో దారే లేదా అంటూ పేరు ఫిక్స్ చేశారు.

అలాగే తమిళంలో వానం తొంద్రాదోవా అనే పేరు ఫిక్స్ చేశారు. ఇక గత ఏడాది మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన వీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఆశించినంత మేర అంచనాలను అందుకో పోవడంతో ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఆయన హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆ సినిమా వాయిదా వేశారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే నాని మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ కాగా మరో సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ.


Click it and Unblock the Notifications











