యుద్దమే ధర్మం కానప్పుడు ధర్మయుద్దాలెక్కడివి.. ‘అర్దశతాబ్దం’ టీజర్ రచ్చ

ఒక్కోసారి కొన్ని పాటలు ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. కొన్ని పాటలు జనాల ఆలోచనలు, మెదళ్ల నుంచి వెళ్లవు. అలానే స్థిరపడిపోతుంటాయి. అలా బాగా ఫేమస్ అయిన పాటల్లోని పదాలే సినిమా టైటిల్స్‌గా వస్తుంటాయి. అలనాటి ఓ క్లాసిక్ పాట, యువతను ఉర్రూతలూగించిన పాట అర్ధశతాబద్దపు అంటూ సిరివెన్నెల రాసిన పాట అందరిలోనూ నరనరాను ఎక్కి ఉంటుంది. అలాంటి అర్ధశతాబ్దం అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తోందన్న సంగతి తెలిసిందే.

ఆ మధ్య రిలీజ్ చేసిన అర్ధశతాబ్దం పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. రాజా రవీంద్ర, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం వంటి వారు నటిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులోని కొన్ని డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'యుద్దమే ధర్మం కానప్పుడు.. ధర్మయుద్దాలెక్కడివి'.. 'న్యాయం ధర్మం అవుతుంది కానీ.. ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు'.. 'ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో.. ఎందుకో.. దేనికో.. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం..'వంటి డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

 Naveen chandra And Karthik Rathnam Ardasatabdam Teaser

ఇక వరుసగా ఫాంలో ఉన్న నవీన్ చంద్ర ఈసినిమాతో మరోసారి తన సత్తాను చాటేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ టీజర్ మాత్రం అందరినీ కట్టిపడేసేలానే ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టికిరన్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X