వరుణ్ తేజ్ ‘గని’లో విలన్‌గా తెలుగు యంగ్ హీరో: బాలీవుడ్‌ బ్యూటీతో మెగా ప్రిన్స్ రొమాన్స్

మొదటి సినిమా 'ముకుంద'తో అదిరిపోయే ఆరంభం దక్కకపోయినా.. రెండో సినిమా 'కంచె'తోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తద్వారా తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఫలితంగా వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలపై క్లారిటీ వచ్చేసింది.

'గద్దలకొండ గణేష్' వంటి భారీ హిట్ తర్వాత వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'గని'. బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. హిందీ హీరో సునీల్ శెట్టి, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు జగపతి బాబు కూడా మంచి రోల్ చేస్తున్నారట.

Naveen Chandra Negative Role in Varun Tejs Ghani

ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందుతోన్న ఈ సినిమాను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టోవల్‌ను తీసుకు వచ్చారు. అలాగే, ఈ సినిమా కోసమే గతంలో అమెరికా వెళ్లి మరీ వరుణ్ తేజ్ శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు గాయపడ్డాడు. దీంతో సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు ఆగిపోయింది. ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం 'F3'లోనూ నటిస్తున్నాడు. అది కూడా ఈ ఏడాదే విడుదల కాబోతుంది. కొద్ది రోజులుగా ఈ రెండు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడతను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X