సీబీఐ ఆఫీసర్‌గా నయనతార.. 22న వస్తున్న అంజలి...

అందాల తార నయనతార ప్రస్తుతం లేడి సూపర్‌స్టార్ ట్యాగ్‌తో దూసుకెళ్తున్నది. ఇటీవల ఆమె నటించిన చిత్రం ఇమైక్క నొడిగల్ చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తెలుగులో అంజలి సీబీఐ ఆఫీసర్‌గా విడుదల కాబోతున్నది. ఆర్ అజయ్ గనన్ ముత్తు దర్శకత్వం వహించగా, నయనతార సీబీఐ ఆఫీసర్‌గా టైటిల్ పాత్రను పోషించింది.

ఈ చిత్రంలో అథర్వ, రాశీఖన్నా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలను పోషించారు. అంజలి భర్తగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రను పోషించారు. కేమియో ఫిల్మ్స్ బ్యానర్‌పై సీజే జయకుమార్ రూపొందించిన ఈ సినిమాకు ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫిని అందించారు.

Nayanthara’s as ‘Anjali CBI Officer.’

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు హక్కులను సీహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ దక్కించుకొన్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

Nayanthara’s as ‘Anjali CBI Officer.’

నటీనటులు: నయనతార, ఆథర్వ, రాశీఖన్నా, అనురాగ్ కశ్యప్, రమేష్ తిలక్, దేవన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్ అజయ్ గనన్‌ముతు
నిర్మాతలు: సీహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్
మ్యూజిక్: హిప్‌హాప్ తమిజా
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
ఎడిటర్: ఆర్డీ రాజశేఖర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X