twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. ఆ అందరికీ దెబ్బ మామూలుగా లేదుగా!

    |

    టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కలకలం రేపుతున్నాయి.. అసలు ఎన్నికలు కూడా ప్రకటించకుండానే బరిలోకి దిగుతున్న అంటూ ప్రకాష్ రాజ్ మొదలుకొని మంచు విష్ణు, హేమ సివీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు తెరమీదకు వచ్చారు. వారందరికీ షాక్ ఇచ్చేలా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    అనూహ్యంగా బరిలోకి

    అనూహ్యంగా బరిలోకి

    అసలు మా ఎలక్షన్ కి సంబంధించి ఎలాంటి హడావుడి లేకుండానే ప్రకాష్ రాజ్ తాను ఎన్నికల బరిలో దిగుతున్న అని ప్రకటించి కలకలం రేపారు. అంతేకాక ఒక ఓపెన్ ప్యానల్ కూడా ప్రకటించి వీరందరి మద్దతుతో బాధ్యత తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని చెబుతూ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ద్వారా ఆర్టిస్టులకు అండగా ఉంటానని చెబుతూ కొన్ని కామెంట్లు కూడా చేశారు.

    పూరీ ఆఫీస్ వేదికగా

    పూరీ ఆఫీస్ వేదికగా

    తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన పూరి జగన్నాథ్ ఆఫీస్ వేదికగా ఈ 'మా' రాజకీయాలు నడుపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే పలువురు మా సభ్యులు వచ్చి ఆయనను కలిసి వెళుతున్నారని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ప్రెసిడెంట్ నరేష్ అలాగే ఆయన కార్యవర్గం ఎలక్షన్స్ కి వెళ్లి ఉద్దేశం లేదని తెలుస్తోంది.. ఈ విషయంలోనే ప్రకాష్ రాజ్ కాస్త ఒత్తిడికి లోనవుతున్నారు అని అంటున్నారు

    వేడి ఉండగా ఎలక్షన్స్

    వేడి ఉండగా ఎలక్షన్స్

    నిజానికి ప్రకాష్ రాజ్ కి ఈ ఎన్నికల బరిలో దిగి ఉద్దేశం లేదని కొందరు సినీ పెద్దలు కావాలని వెనక నుండి నడిపిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఎలాగో రంగం లోకి దిగాను కాబట్టి వేడి ఉండగా ఎలక్షన్స్ జరిగితే తాను గెలిచేయొచ్చని ప్రకాష్ రాజ్ భావిస్తున్నారట. వేడి చల్లారాక రాజకీయం చేయలేమని ఆయన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ సహా బరిలోకి దిగుతున్నారు అని ప్రకటించిన అందరికీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి మా అసోసియేషన్ రూల్స్.

    బైలాస్ ప్రకారం

    బైలాస్ ప్రకారం

    నిజానికి ఎలాంటి సంస్థ అయినా ఏర్పడినప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ ఫిక్స్ చేస్తారు. ఇక ఈ అసోసియేషన్ ఏర్పడినప్పుడు ఏర్పాటుచేసిన బైలాస్ ప్రకారం రెండు ఏళ్ళు పూర్తయిన వెంటనే ప్రెసిడెంట్ సహా కార్యవర్గం పదవి కోల్పోయే ప్రమాదం ఉండదు. ఒకవేళ ప్రెసిడెంట్ ఆరేళ్ల వరకు కొనసాగాలని భావిస్తే ఆరేళ్ల పాటు ప్రెసిడెంట్ గా కొనసాగే అవకాశం కూడా ఉంది.

    ఆరేళ్ళ పాటు

    ఆరేళ్ళ పాటు


    ఈ విషయంలోనే ప్రకాష్ రాజ్ కి టెన్షన్ పట్టుకుంది అని అంటున్నారు. ఒకవేళ నరేష్ తాను మరో నాలుగేళ్ల పాటు కొనసాగుతానని అంటే పరిస్థితి ఏంటో అని టెన్షన్ ఆయన ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్స్ ఎప్పుడు అని ప్రకాష్ రాజ్ ప్రస్తుత మా ప్రెసిడెంట్ కు పంపిన లేఖ కు ప్రత్యుత్తరం గా పంపిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం ఏదైనా ఎన్నిక కాబడిన ఒక కమిటీ ఆరేళ్లపాటు పదవిలో కొనసాగే అవకాశం ఉందంటూ లేక పంపించినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    ఎన్నికలు ఎప్పుడు అంటూ

    ఎన్నికలు ఎప్పుడు అంటూ

    గత 28 ఏళ్ల నుంచి పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు పాత కమిటీ పదవిలోనే ఉంటుంది. ఈ విషయాలన్నీ పేర్కొంటూ నరేష్ తరపు న్యాయవాది ప్రకాష్ రాజ్ కి ఒక లేఖ రాశారట. ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం లాగా కనిపించడం లేదని ప్రకాష్ రాజ్ భావిస్తూ నిన్న ఎన్నికలు ఎప్పుడు అంటూ కూడా చేశారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

    English summary
    As per latest update Prakash Raj's mind is in question mark now. When he asked to know the date of MAA elections, the advocate from Naresh's side gave a reply explaining the clause in the by laws.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X