twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR సినిమాకు ఆస్కార్ అవసరమా.. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను: హీరో నిఖిల్

    |

    దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలి అని చాలామంది భారతీయులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల భారత్ నుంచి ఈ సినిమాను నామినేషన్స్కు పంపిస్తారు అనుకుంటే ఊహించని విధంగా మరొక సినిమాను నామినేషన్స్ కు పంపించారు. అయితే ఈ విషయంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. అతను ఏమని వివరణ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..

    అత్యధిక ఆదరణ పొందిన సినిమాగా

    అత్యధిక ఆదరణ పొందిన సినిమాగా

    ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని అత్యధిక ఆదరణ పొందిన సినిమాలలో RRR ఒకటిగా నిలిచింది. అయితే దేశ విదేశాల్లో కూడా ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఆస్కర్ బరిలో నిలిచే అర్హత సాధిస్తుంది అని ఇండియన్ సినీ ప్రముఖులు కూడా వివరణ ఇచ్చారు.

    RRR ను కాకుండా..

    RRR ను కాకుండా..

    అయితే భారీ స్థాయిలో ఆదరణ పొందినప్పటికీ కూడా ఇండియా నుంచి నామినేషన్స్ కు పంపించే సినీ కమిటీ సభ్యులు చర్చల అనంతరం గుజరాతి సినిమా 'చెల్లో షో' అనే సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కు పంపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అదొక హాలీవుడ్ రీమేక్ అయినప్పటికీ కూడా ఎందుకు ఆ సినిమాను పంపించారు అని చాలా మంది విమర్శలు చేశారు.

    హీరో నిఖిల్ రియాక్షన్

    హీరో నిఖిల్ రియాక్షన్

    అయితే ఆస్కార్ నామినేషన్స్ లో RRR పంపకపోవడంపై మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఈ తరుణంలో హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా తనదైన శైలిలో స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. తనకు ఆస్కార్ అవార్డులపై ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అని చాలామంది ఆస్కార్ ను ఇష్టపడతారు కానీ నా వరకు ఒక సినిమాకు అతిపెద్ద విజయం అంటే అది ప్రజల నుంచి పొందే ప్రేమ ప్రశంసలు అని నిఖిల్ అన్నాడు.

     నా ఆలోచన ప్రకారం

    నా ఆలోచన ప్రకారం

    అలాగే నా ఆలోచన ప్రకారం అయితే ప్రజల నుంచి ఒక సినిమాకు వచ్చే ఆదరణ కంటే మరొక పెద్ద అవార్డు ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ను RRR సినిమాను ఎంతో మంది ప్రజలు ఆదరించారు. ఆ సినిమాకు అదే ఒక పెద్ద విజయం లాంటి అవార్డు. అలాంటప్పుడు ఆస్కార్ ఎందుకు అనేది నా ఆలోచన. ఫిలిం ఆఫర్ అలాగే జాతీయ అవార్డులు అని మనకే ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో నేనైతే ఆస్కార్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను.. అని నిఖిల్ తెలియజేశాడు.

     అవసరం లేదు..

    అవసరం లేదు..

    అదేవిధంగా ఈ విషయంలో ఎవరైనా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించాలి అంటూ నిఖిల్ మరొక వివరణ ఇచ్చాడు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. మనకు ఆస్కార్ సర్టిఫికెట్ ఎందుకు? మన సినిమాలు చాలా బాగుంటాయి విడుదలైన అన్నిచోట్ల కూడా భాషలతో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల నేను స్పెయిన్ లో RRR సినిమా చూసినప్పుడు అక్కడ థియేటర్స్ కూడా చాలా హౌస్ ఫుల్ గా కనిపించాయి. ప్రపంచం అంతా కూడా మన సినిమాలకు మంచి అభినందనలు దక్కుతున్నాయి. అలా ఆలోచిస్తే మనకు ఆస్కార్ అవసరం లేదు కదా అని నిఖిల్ తెలియజేశాడు.

    English summary
    Nikhil Siddhartha sensational comments on RRR movie Oscar issues
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X