twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎన్టీఆర్-కథానాయుడు’ స్పెషల్ షోలు... అభిమానులకు పండగే!

    |

    బాలకృష్ణ, విద్యా బాలన్ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతల విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

    జనవరి 9 నుంచి 16 వరకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా రెండు షోలకు అనుమతి లభించింది. దీంతో రోజూ 4 ఆటలకు బదులు 6 ఆటలు ప్రదర్శింపబడనున్నాయి. పండగ సమయం కావడంతో ఇది కలెక్షన్ల పరంగా మరింత కలిసొచ్చే అంశం.

    NTR Kathanayakudu special shows in AP

    మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న, రెండో భాగం 'ఎన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

    ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    AP Government granted permission to NTR Kathanayakudu movie. Officials allowed 2 special shows between 5AM & 11AM from 9th January to 16th January. Total 6 shows can be screened in a day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X