For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  GodFather కు నోటీసులు.. థమన్ చేసిన పనికి ఇరుకునపడ్డ నిర్మాత ఎన్వీ ప్రసాద్!

  |

  మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లొ రూపొందిన గాడ్‌ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో దర్శకుడు మోహన్ రాజా, తమన్ ఎస్, నిర్మాత ఎన్వీ ప్రసాద్, సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ..

  గాడ్‌ఫాదర్ అని పెడితే బాగుంటుందని

  గాడ్‌ఫాదర్ అని పెడితే బాగుంటుందని


  గాడ్‌ఫాదర్ కథను బ్రహ్మ అనే ఓ కనిపించని శక్తి నడుపుతుంటుంది. బ్రహ్మ సీన్‌లో ఉండడు. కానీ పాత్రలన్నీ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకొంటారు. జయదేవ్ ఎలాంటి ప్లాన్స్ వేసినా.. బచ్చా అని బ్రహ్మ నవ్వుకొంటాడు. అందరికి బ్రహ్మ క్యారెక్టర్ గాడ్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాకు సర్వంతర్యామి అనే వర్కింగ్ టైటిల్ అని మోహన్ రాజా చెప్పారు. అయితే ఈ సినిమాకు గాడ్‌ఫాదర్ అని పెడితే బాగుంటుందని అనుకొన్నాను. అదే విషయాన్ని నేను సూచించాను. అంతేకాకుండా మీకు G అక్షరంతో బ్లాక్‌బస్టర్లు ఉన్నాయని చెప్పడంతో చిరంజీవి కూడా కమిట్ అయ్యాడు అని తమన్ చెప్పాడు.

  పారామౌంట్ పిక్చర్స్‌ నుంచి నోటీసులు

  పారామౌంట్ పిక్చర్స్‌ నుంచి నోటీసులు


  తమన్ చెప్పిన ప్రకారం గాడ్‌ఫాదర్ టైటిల్‌కు ఫిక్స్ అయ్యాం. ఆ టైటిల్ సంపత్ నంది, కేకే రాధామోహన్ వద్ద ఉండేది. మేము అడగ్గానే ఇచ్చారు. ఆ తర్వాత అన్ని చోట్ల టైటిల్‌ను ప్రాసెస్ చేశాం. అయితే రిలీజ్‌కు నెల ముందు పారామౌంట్ పిక్చర్స్‌ నుంచి నోటీసులు వచ్చాయి. 1990లో ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేశారు. అయితే అప్పటికే ప్రమోషన్స్ పరంగా అన్ని పనులు పూర్తయ్యాయి. అప్పుడు ఏం చేయాలో తోచలేదు అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు.

  సింపుల్‌గా తమన్ చెప్పేసి వెళ్లాడు.. కానీ

  సింపుల్‌గా తమన్ చెప్పేసి వెళ్లాడు.. కానీ


  గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో నోటీసులు రావడంతో పారామౌంట్ పిక్చర్స్‌తో చర్చలు జరిపాం. ఇండియాలో హిందీలో మెగాస్టార్ గాడ్‌ఫాదర్ అని పెట్టాం. తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్ అని పెట్టాం. ఇక విదేశాల్లో చిరంజీవి 153 గాడ్‌ఫాదర్ అని పెట్టాం. చకచకా డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తి చేశాం. గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టమని సింపుల్‌గా తమన్ చెప్పేసి వెళ్లిపోయాడు. కానీ రిలీజ్ సమయంలో నోటీసులు రావడంతో మా తంటాలు మేము పడ్డాం అని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

  చిరంజీవికి, నాకు నోటీసులు

  చిరంజీవికి, నాకు నోటీసులు


  ట్రేడ్ మార్క్ చట్టాన్ని ఉల్లంఘించారని చిరంజీవికి, నాకు, ఆర్బీ చౌదరీకి ఢిల్లీ లాయర్లు నోటీసులు పంపారు. చివరకు తిరుపతిలోని నా ఇంటి అడ్రస్‌కు కూడా నోటీసులు పంపారు. మా ఇంటి అడ్రస్ ఎవరు ఇచ్చారో కూడా అర్ధం కాలేదు. ఓ దశలో ఈ టైటిల్ రాకపోతే ఎలా అని వేర్వేరు టైటిల్స్ చాంబర్‌లో రిజిస్టర్ చేశాం. ఒక ఫారిన్ కంపెనీతో లీగల్ ఫైట్ అనేది చాలా కష్టం. చివరకు వారి డిమాండ్ ప్రకారం.. మేమంతా సంతకాలు చేసి పంపిస్తే.. 28వ తారీఖు మాకు క్లియరెన్స్ వచ్చింది. మాకు సహకరించిన పారామౌంట్ వారికి థ్యాంక్స్ అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.

  ఎన్వీ ప్రసాద్ హ్యాట్సాఫ్

  ఎన్వీ ప్రసాద్ హ్యాట్సాఫ్


  గాడ్‌ఫాదర్ సినిమా టైటిల్ విషయంలో ఇంత వివాదం జరిగినా ఎన్వీ ప్రసాద్ మా వరకు రానివ్వలేదు. ఆయన గుండె చాలా గట్టిది కాబట్టి మాకు చెప్పకుండా అంతా ఆయనే చూసుకొన్నాడు. సినిమా అవుట్ పుట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకొంటాడు. అందుకు ఆయనకు థ్యాంక్స్ అని థమన్ అన్నారు.

  English summary
  Megastar Chiranjeevi's Godfather movie is released on October 5th Worldwide. This movie is getting good report from box office. In this occassion, NV Prasad, Mohan Raja, Satya Dev and Thaman S organised a press conference.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X