OG 2: అకీరాతో ఓజీ 2.. డైరెక్టర్ సుజీత్‌ సాలిడ్ రిప్లై

Pawan Kalyan OG: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ'. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించింది. ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌తో పాటు సినిమా పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. పవన్‌ను మాఫియా డాన్ పాత్రలో చూసిన అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సింపుల్ గా చెప్పాలంటే.. మెగా ఫ్యాన్స్ పండుగ వచ్చేసిందే. ఉత్సవాన్ని మరింత రెట్టింపు చేయడానికి ఓజీ సీక్వెల్‌ 'ఓజీ 2'ప్రకటన వచ్చేసింది. తాజాగా డైరెక్టర్ సుజీత్ ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించింది. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. "మూడేళ్ల కష్టం ఈ ఓజీ సక్సెస్ తో మూవీతో ప్రతిఫలించింది. మొదటి రోజు నుంచి మాకు వెన్నంటి అండగా నిలిచిన నిర్మాతలు దానయ్య, కళ్యాణ్ దాస్లకు కృతజ్ఞతలు. కానీ ఈ కథకు ఇంత పవర్, భారీతనం రావడానికి కారణం పవన్ కళ్యాణ్. నేను ఆయనకు వీరాభిమానిని. 'జానీ' సినిమా చూసినప్పుడు ఒక్కసారైనా కలుస్తానని కోరుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఓ అభిమానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇది నా జీవితంలో అతిపెద్ద డ్రీమ్ నెరవేరింది' అని ఎమోషనల్ అయ్యారు.

OG 2 Pawan Kalyan Akira Sujeeth Sequel Tokyo Showdown and Latest Updates

ఓజీ సినిమాకు తమన్ - సంగీతం, నవీన్ నూలి - ఎడిటర్, రవి చంద్రన్ - సినిమాటోగ్రాఫర్ మూడు ప్రధాన పిల్లర్స్ అని పేర్కొన్నారు. తమన్ తనను, కథను అందరికంటే ఎక్కువగా నమ్మారని సుజీత్ కొనియాడారు. టీమ్‌ సహకారం, పవన్ కళ్యాణ్ మాస్ ప్రెజెన్స్ కలిసి 'ఓజీ'ను అద్భుతమైన హిట్‌గా మార్చిందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో, థియేటర్లలో పవర్‌ఫుల్ ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, పవన్ కళ్యాణ్ డాన్ లుక్ వైరల్ అవుతున్నాయి. ఓ ఫ్యాన్ గా ఓజీ థియేటర్‌లో చూడడం మినహాయించి ఏం చేయాలో తెలియదంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అకీరా సీక్వెల్‌లో కనిపిస్తాడా?
ఇప్పటికే ఈ గ్యాంగ్‌స్టర్ మూవీకి 'ఓజీ 2' రూపొందుతుందని అధికారికంగా ప్రకటించబడింది. తాజాగా డైరెక్టర్ సుజీత్ ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. సుజీత్ మాట్లాడుతూ, ''ఓజీ 2'లో అకీరాతో తీస్తానా అనే విషయాన్ని పవన్‌కల్యాణ్‌కు అడగాలి. అకీరాతో తీస్తే హ్యాపీ అవుతాడు. ప్రస్తుతం అందరూ 'ఓజీ' హైప్‌లో ఉన్నారు. దీన్ని ఎంజాయ్ చేసిన తర్వాత సీక్వెల్ విషయాలు బయటకు వస్తాయి. అకీరా సెట్స్‌కి వచ్చాడు. తనలో ఓ స్పార్క్ ఉంది. ఇంతకుమించి ఏం చెప్పలేను'అని తెలిపారు. ఈ ప్రకటనతో సీక్వెల్‌లో అకీరా పాత్ర కనిపించే అవకాశం ఉన్నదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

'ఓజీ' సినిమాటిక్ యూనివర్స్ పై సుజీత్ స్పష్టత
'సాహో'-'ఓజీ'లతో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభిస్తున్నారనే విషయంపై డైరెక్టర్ సుజీత్ స్పష్టత ఇచ్చారు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరును తన టీమ్‌ ప్రకటించిందనీ, ఇది వర్క్‌ఇన్‌ప్రోగ్రెస్‌గా ఉంటుందనీ, అయితే.. అన్ని సినిమాలను ఒక యూనివర్స్‌లో కలపాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏదైనా సినిమాలో ఒక పాత్ర తన గురించి చెబుతూ, గతంలో 'ఓజీ'లో పని చేశానని పేర్కొంటే, అది యూనివర్స్‌లో కలిపి చూపిస్తారని అన్నారు. ఏదిఏమైనా సుజీత్ ప్రకటన తరువాత ఓజీ సీక్వెల్‌లో అకీరా ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్ భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: sujeeth pawan kalyan akira
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X