twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయశాంతిని చూసి నవ్వుకున్నాం.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్

    |

    సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి తెలుగు సినిమా డైలాగ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరంగా స్పందించారు. పరుచూరి పలుకులు అనే యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా సినిమా సంగతులు, విశ్లేషణలు ప్రేక్షకులతో పంచుకుంటున్న ఆయన.. తన తాజా వీడియోలో విజయశాంతి గురించి మాట్లాడారు. ఆమె సినీ ఎంట్రీ నుంచి కెరీర్ లోని మలుపుల వరకు జరిగిన కొన్ని విషయాలు వెల్లడించారు పరుచూరి.

    పరుచూరి బ్రదర్స్ కథలు, మాటలు, స్క్రీన్‌ప్లేలో విజయశాంతి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిందని, తను మా అన్నయ్యను పితాజీ అని, నన్ను అంకుల్‌ అని పిలుస్తుందని చెప్పారు గోపాలకృష్ణ. అయితే విజయశాంతిని తాను మాత్రం కుమార్తెలా భావిస్తుంటానని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. తాము చిత్రసీమ లోకి ఎంటరైన సమయంలోనే విజయశాంతి కూడా సినీ ఆరంగేట్రం చేసిందని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా ఆమె ఆరంగేట్రం సమయంలో జరిగిన ఓ సంఘటనను పరుచూరి ప్రస్తావించారు.

    Paruchuri Gopala Krishna says about Vijayashanti

    ''అది 1981 వినాయక చవితి సమయం. అప్పుడు విజయవాహిని స్టూడియోలో ప్రతాప్‌ ఆర్ట్స్‌ రాఘవతో నేను కూర్చుని ఉన్నా. సరిగ్గా ఆ సమయం లోనే విజయశాంతిని హీరోయిన్‌గా పరిచయం చేయాడానికి తీసుకొచ్చారు. ఆమెకు సుమారుగా 15 ఏళ్లు ఉండొచ్చు అంతే. చాలా సన్నగా ఉండేది. హీరోయిన్‌గా ప్రయత్నం చేస్తున్నాం అని వాళ్లు చెప్పడంతో.. వెంటనే ఈ పిల్ల హీరోయిన్‌ ఏంటి? అని రాఘవ నవ్వాడు. లేదు.. లేదు ఈ అమ్మాయి ముఖంలో చాలా కళ ఉందండి అని వాళ్లు చెప్పడం జరిగింది. మొత్తానికి ఎలాగోలా సినీ గడప తొక్కిన ఆ చిన్న పిల్లే నేను 'ఒసేయ్‌ రాములమ్మ'ని అని నిరూపించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది. ఆ చిన్న పిల్లే తన కర్తవ్యాన్ని పరిశ్రమకి చూపించింది'' అని పరుచూరి చెప్పుకొచ్చారు.

    సినిమాలతో చేస్తూనే మెల్లగా రాజకీయాల్లోకి వెళ్లిన విజయశాంతి.. గత 15 ఏళ్లుగా సినీ లోకానికి విరామ ఇచ్చింది. తిరిగి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రానున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి రోల్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉండనుందని సమాచారం.

    English summary
    In the latest video of Paruchuri Palukulu programme Paruchuri Gopala Krishna says about Vijayashanti cine journey
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X