twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather: చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో ఆ తప్పులు.. పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్

    |

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. ఇప్పుడు తాజాగా ఆయన నుంచి వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇలాగే భారీ హోప్స్ తో ఇటీవల విడుదలైన చిత్రం గాడ్ ఫాదర్. ప్రముఖ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే అనుకున్నంత కెలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు, నటుడు పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలోని మూడు తప్పులను ఎత్తి చూపారు.

    సినిమాపై అంచనాలు..

    సినిమాపై అంచనాలు..

    మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ లో చిరంజీవి.. బ్రహ్మగా అదరగొట్టారు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు రాగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

    భారీ తారాగణంతో..

    భారీ తారాగణంతో..

    బాలీవుడ్ స్టార్ హీరోతో సల్మాన్ ఖాన్ తోపాటు అతిపెద్ద తారాగణంతో గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో దర్శనమిస్తే, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అలాగే విలన్ గా సత్యదేవ్, పూరి జగన్నాథ్, తాన్య రవిచంద్రన్, సునీల్, షఫీ, సిరివెన్నెల ఫేమ్ సర్వదమన్ బెనర్జీ, దివి వాద్యా వంటి తదిరులు యాక్ట్ చేశారు.

     దసరా కానుకగా..

    దసరా కానుకగా..

    భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. అయితే వసూళ్లలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిన చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత అంచనాలను చేరుకోలేకపోయింది.

    కథలో మార్పులు చేర్పులు..

    కథలో మార్పులు చేర్పులు..

    అయితే గాడ్ ఫాదర్ కలెక్షన్స్ తగ్గడానికి పది రోజుల గ్యాప్ లోనే తెలుగులో విడుదలైన కాంతార సినిమా కూడా కారణమనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ మలయాళ సినిమా లూసీఫర్ కి రీమేక్ అని తెలిసిందే. మలయాళ మెగాస్టార్ నటించిన ఈ చిత్రాన్ని గాడ్ ఫాదర్ రిలీజ్ కు ముందే ఎంతో మంది చూడటంతో ఆ కథ ఏంటో తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో కథలో మార్పులు చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అలాగే తెలుగు ఆడియెన్స్ కు తగినట్లుగా మార్పులు, చేర్పులు చేశారు.

    గాడ్ ఫాదర్ పై రివ్యూ..

    గాడ్ ఫాదర్ పై రివ్యూ..

    అయితే చిరంజీవికి సపోర్ట్ రోల్స్ చేసిన నటీనటుల ఎంపికలో డైరెక్టర్ మోహన్ రాజా పునరాలోచించుకుంటే బాగుండేదని సీనియర్ డైరెక్టర్, నటుడు పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినిమాలపై రివ్యూస్ ఇస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై రివ్యూ చేస్తూ పలు తప్పిదాలను చెప్పుకొచ్చారు.

    అతను మైనస్.. ప్లస్..

    అతను మైనస్.. ప్లస్..

    డ్యాన్స్ లేని చిరంజీవి పాత్రను చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెప్పిన గోపాలకృష్ణ.. సినిమాలో షఫీ వేసిన పాత్రను సునీల్ వేసుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో లేదా ఈ ఇద్దరికి బదులు వేరే ఆర్టిస్ట్ ఎవరైనా చేసుంటే బాగుండేదన్నారు. అలాగే ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ ఒకరకంగా ప్లస్ అయిన మరోరకంగా మైనస్ అయిందన్నారు. చిరంజీవి నడుస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడం అభిమానులకి బాధ కలిగించిదన్నారు.

    డైలాగ్ అలా రాస్తే..

    డైలాగ్ అలా రాస్తే..

    గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ కు బదులు పవన్ కల్యాణ్ లేదా రామ్ చరణ్ చేసుంటే మరింత బాగుండేదన్నారు. చిరంజీవి ఫైట్ చేయకుండా సల్మాన్ ఖాన్ ఫైట్ చేసే విషయంలో ఈ ఇద్దరు ఉంటే అభిమానులకు మరింత కిక్ ఇచ్చేదన్నారు. అలాగే డైలాగ్ లు బాగున్నాయి. కానీ చిరంజీవి స్థాయిలో మాత్రం లేవన్నారు. ఉదాహరణకు 'నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు' డైలాగ్ ని 'రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను కానీ, దాన్ని శాసించే సత్తా నాకుంది' అని రాసి ఉంటే బాగుండేదన్నారు గోపాలకృష్ణ.

    English summary
    Paruchuri Gopalakrishna Shocking Comments On Chiranjeevi Godfather Movie Mistakes In Paruchuri Paatalu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X