పవిత్ర లోకేష్‌తో పెళ్లి.. అలాంటి చిక్కుల్లో వీకే నరేష్.. మూడో భార్యతో ఆ సమస్య!
ప్రముఖ నటుడు వీకే నరేష్ నాలుగో వివాహానికి సంబంధించిన వార్త స్థానిక మీడియానే కాకుండా జాతీయ మీడియాను కూడా కుదిపేస్తున్నాయి. ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకొంటున్నారనే వార్త ఇప్పడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇద్దరి వైవాహిక జీవితానికి సంబంధించిన బంధాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అయితే నరేష్ మూడో భార్యకు సంబంధించిన వ్యవహారాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మూడో భార్య చీటింగ్ కేసులో
అయితే వీకే నరేష్ మూడో భార్య చీటింగ్ కేసులో ఇరుక్కోవడం కొద్ది నెలల క్రితం వివాదాస్పదమైంది. మాజీ పీసీసీ అధ్యక్షుడి సోదరుడి కుమార్తెను అని, అలాగే వీకే నరేష్ భార్యను అని చెప్పి మా వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసింది. అయితే తిరిగి డబ్బు అడిగితే ముఖం చాటేసింది. మా డబ్బు మాకు ఇప్పించండి అంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించడంతో వీకే నరేష్ పేరు మీడియాలో నానింది.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు
వీకే నరేష్ మూడో భార్య అధిక వడ్డీ ఇస్తామని చెప్పి తమ వద్ద డబ్బు తీసుకొని మోసగించింది అని ఐదుగురు మహిళలు కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో నరేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ సమయంలో కొద్ది సంవత్సరాలుగా తన మూడో భార్యతో సంబంధాలు లేవు. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. ఈ వార్తల్లో నా పేరును లింక్ చేయవద్దని నరేష్ ప్రకటన చేశారు.

వీకే నరేష్ నాలుగో పెళ్లి విషయంలో
ఇలాంటి వార్తల నేపథ్యంలో వీకే నరేష్ నాలుగో పెళ్లి విషయంలో రకరకాల ట్విస్టులు వినిపిస్తున్నాయి. పెళ్లికి సిద్దమవుతున్న పవిత్రా లోకేష్ తన భర్త నుంచి విడాకులు తీసుకోలేదనే విషయం ఈ వ్యవహారంలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ సహ జీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకోవాలంటే పవిత్ర లోకేష్ అధికారికంగా విడాకులు తీసుకోవాల్సి ఉంది. వీకే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లికి విడాకులే అడ్డంకిగా మారిందనే విషయం చర్చనీయాంశమైంది.

మూడో భార్యకు విడాకులు ఇవ్వలేదా?
ఇక వీకే నరేష్ పరిస్థితి కూడా అలానే ఉంది. తన మూడో భార్య, నరేష్ అధికారికంగా విడాకులు తీసుకోలేదనే విషయం జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే గత ఏడేళ్లుగా మూడో భార్య, నరేష్ వేర్వేరుగా ఉంటున్నారు. ఆ క్రమంలోనే పవిత్రా లోకేష్‌కు వీకే నరేష్ దగ్గరయ్యారు అని సన్నిహితులు చెప్పుకొంటున్నారు.

ప్రముఖ రచయిత్రి ఫేస్‌బుక్ పోస్టు
ఇలాంటి కథనాల మధ్య ప్రముఖ రచయిత్రి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన మరింత ఆసక్తిని రేపింది. పవిత్రా లోకేష్‌తో అఫైర్ వార్త నిజమే. వారిద్దరి పెళ్లికి సిద్దమవుతున్నారు. కానీ తన మూడో భార్యకు వీకే నరేష్ విడాకులు ఇవ్వలేదు. కాబట్టి తమ పెళ్లి గురించి నరేష్ గానీ, పవిత్ర గానీ.. వివాదాస్పద వార్తలు, రూమర్లపై క్లారిటీ ఇవ్వాలి అని ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు.


Click it and Unblock the Notifications











