For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ మల్టీస్టారర్‌పై సర్‌ప్రైజింగ్ న్యూస్.. సీక్రెట్‌‌గా ప్లాన్ చేసిన పవర్ స్టార్

  |

  మెగా బ్రదర్‌గా హీరోగా పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అతడు ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం సినిమాలకు గ్యాపిచ్చిన పవన్.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నాడు.

  పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!

  వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోన్న టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాను ఈ స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను కూడా చేశారు. ఇప్పుడాయనే తెలుగులోకి ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

  Pawan Kalyan and Sai Dharam Tej Movie Starts From This Week

  పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వినోదయ సీతమ్' సినిమాను గత జూలై మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. దీనికితోడు పవర్ స్టార్ మరికొన్ని ప్రాజెక్టులు ప్రకటించడంతో ఈ మూవీ చేయరని అంతా అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మల్టీస్టారర్ మూవీని ఈ వారం నుంచే మొదలు పెట్టబోతున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన సెట్ వర్క్ కూడా పూర్తైనట్లు తెలిసింది. మొదటి షెడ్యూల్‌లోనే పవన్ పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎంతో సీక్రెట్‌గా ప్లాన్ చేశారని సమాచారం.

  Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

  ప్రస్తుతం పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. దీనితో పాటు హరీష్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని చేయనున్నాడు. అలాగే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మరో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు.

  English summary
  Power Star Pawan Kalyan Gave Green Signal to Samuthirakani's Vinodhaya Sitham Remake. This Movie Shooting Starts From This Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X