Bappi Lahiri ఐరోపా దేశాల్లో కూడా బప్పీ లహిరికి ఖ్యాతి.. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మోహన్ బాబు భావోద్వేగం

దిగ్గజ సంగీత దర్శకుడు బప్పీ లహిరి మరణంతో సంగీతాభిమానులు మూగబోయారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే విషాదంలో కూరుకుపోయారు. ఇలాంటి విషాద సమయాల్లో ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నట సింహం నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందిస్తూ..

భారతీయ చలనచిత్ర సంగీత విభాగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్వరకర్త బప్పీ లహరి కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. బప్పీ లహరి పాటలు హిందీ సంగీతప్రియులకు ఎంత చిరపరిచితమో... తెలుగునాట కూడా ఆయన స్వరపరచిన గీతాలు అంతే ప్రాచుర్యం పొందాయి. డిస్కో తరహా పాటలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించారు. డిస్కో డ్యాన్సర్ చిత్రంలోని 'జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా ఆజా..' పాట నేటికీ రష్యాతో సహా తూర్పు ఐరోపా దేశాల్లో వినిపిస్తుంది. అక్కడి పార్టీల్లో ఈ పాటకు యువత డ్యాన్స్ చేస్తుంటారు. డిస్కో డ్యాన్సర్ హీరో మిథున్ చక్రవర్తి ఆ దేశాల వాళ్ళకు పరిచయమయ్యారంటే అది బప్పీ లహరి బాణీ ప్రభావమే. గాయకుడిగానూ ఈతరం వాళ్ళను బప్పీ లహరి మెప్పించారు. తెలుగు చిత్రాలకు ఎన్నో చక్కటి గీతాలు ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి సినిమాలకు ఇచ్చిన పాటలు శ్రోతలను ఆకట్టుకొన్నాయి. సినీ రంగంలో బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. బప్పీ లహరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

Pawan Kalyan, Balakrishna, Mohanbabu condolences Bappi Laharis death

నందమూరి బాలకృష్ణ తన సంతాప ప్రకటనలో.. సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. నేను నటించిన రౌడీ ఇన్స్‌పెక్టర్, నిప్పురవ్వ చిత్రాలకు ఆయన సంగీత అందించారు. ఈ రోజు ఆయన మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను. ఆయన కుటుం సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఓ ప్రకటనలో తెలిపారు.

దిగ్గజ సంగీత దర్శకుడు బప్పీ లహిరి మరణ వార్త నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇండియాలోని గొప్ప సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. నేను నటించిన మూడు సూపర్ హిట్ సినిమాలకు ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అందించిన పాటలు నా సినిమాకు కీలకంగా మారాయి. నాకు ఆయనతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆయన కుటుంబానికి భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటాను అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X