Pawan Kalyan Birthday OG Blast: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే ట్రీట్.. వైల్డ్‌గా ఓజీ గ్లింప్స్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ ఓజీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు హీరో పవన్ కళ్యాణ్, హీరో ప్రియాంక మోహన్‌ల లుక్స్‌ను రివీల్ చేయగా.. ఈసారి మరో కీలక నటుడిని చూపించారు. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ కానుండగా.. ఈ స్పెషల్ గ్లింప్స్ ఎలా ఉంది? అభిమానులను ఆకట్టుకుందా? లేదా? అనేది పరిశీలిస్తే..

ఓజీ సినిమా బడ్జెట్ ఎంత?
ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్‌హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Pawan Kalyan Birthday OG Blast power packed glimpse raised expectations for the movie to next level

సెప్టెంబర్ 25న ఓజీ
సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. అదే రోజున విడుదల కావాల్సిన నటసింహం నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల అఖండ 2 వెనక్కి తగ్గడంతో ఓజీ సోలో రిలీజ్ కానుంది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో యూఎస్‌లో ఓజీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఓజీ టికెట్ ధర అక్షరాల 5 లక్షల రూపాయలు
నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతుండటంతో ఓజీ సినిమా అప్పుడే 900K వసూళ్లు రాబట్టింది. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా ఓజీ నిలిచింది. సెప్టెంబర్ 24న అమెరికా వ్యాప్తంగా ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇక అమెరికాలో ఓ అభిమాని ఓజీ సినిమా తొలి టికెట్‌ను ఏకంగా 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి పవన్ కళ్యాణ్‌పై అభిమానం చాటుకున్నారు. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట.

ఓజీ బర్త్ డ్ గ్లింప్స్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఓజీ ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఓజీ నుంచి రెండు పాటలు విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఓజీ నుంచి బర్త్ డే గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. నిమిషం 4 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌లో 'డియర్ ఓజీ.. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా.. నీ ఓమీ.. హ్యాపీ బర్త్ డే ఓజీ అంటూ పవర్ ఫుల్ వాయిస్‌తో గ్లింప్స్ ముగించారు. విలన్‌గా ఇమ్రాన్ హష్మి పేరును రివీల్ చేశారు.

పవన్‌కు ధీటుగా ఇమ్రాన్ హష్మి
పవన్‌కు ధీటుగా స్టైలీష్‌గా కనిపించారు ఇమ్రాన్. ఇక పవన్ కళ్యాణ్ స్టైల్‌గా కత్తిని తిప్పుతూ ప్రత్యర్ధి గ్యాంగ్‌ను ఊచకోత కోయడం బాగుంది. దీనికి తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూనకాలు తెప్పించేలా ఉంది. మొత్తం మీద ఓజీ బర్త్ డే గ్లింప్స్‌ మాత్రం ఈ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు.

More from Filmibeat

Read more about: pawan kalyan og emraan hashmi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X