Just In
Don't Miss!
- News
వీర జవాన్లకు పవన్ కళ్యాణ్ సెల్యూట్: గోశాలలో జనసేనాని కనుమ వేడుకలు
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చాలా రోజుల తరువాత కనిపించిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు, కూతురు.. క్యూట్ పిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు నిత్యం ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత పవన్ అభిమానుల్లో తన స్థానాన్ని మరో స్థాయికి పెంచుకున్నాడు. ఇక ఆయన ఫ్యామిలీ చెందిన ఫొటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అకిరా నందన్, ఆధ్య ఇటీవల నిహారిక పెళ్లిలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిన్న కుమారుడు, చిన్న కూతురి ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అన్నా లెజ్‌నేవా
పవన్ కళ్యాణ్ భార్య అన్నా అన్నా లెజ్‌నేవా ఇటీవల పిల్లలతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. నిహారిక పెళ్లికి హాజరు కాకపోవడంతో ఒక్కసారిగా ఆ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు పవన్ పెద్ద కొడుకు అకిరా నందన్, కూతురు ఆధ్యలతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో ఉదయ్ పూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

చిన్న పవర్ స్టార్ క్యూట్ ఫొటోస్
ఇక సొంత దేశం రష్యాకు వెళ్లిన అన్నా లెజ్‌నేవా మళ్ళీ అత్తవారింటికి వచ్చేసింది. ఆమె కూతురు పోలేనా అంజనా పవనోవా, అలాగే కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో ఆమె ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఒక్కసారిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. చిన్న పవర్ స్టార్ ను చూసిన ఆభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడంతో..
అయితే పవన్ భార్య అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడంతో సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. అన్నా లెజ్‌నేవా గతంలో చాలాసార్లు మెగా ఫ్యామిలీకి చెందిన ఈవెంట్స్ లలో పాల్గొంది. శ్రీజ పెళ్లిలో కూడా ఆమె ముందుండి చిన్న కోడలిగా వివిధ పనులలో కూడా పాల్గొంది. తెలుగు నేర్చుకోవడమే కాకుండా పవన్ కోసం ఆమె పూర్తిగా హిందు సంప్రదాయాలను కూడా పాటిస్తోంది.

కారణం అది కాదు..
ఇక అన్నా లెజ్‌నేవా పెళ్లికి రాకపోవడానికి అసలు కారణం క్రిస్టమస్ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా పుట్టింటికి వెళ్లిందనే టాక్ వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అత్తారింటికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు సడన్ గా క్రిస్టమస్ కంటే ముందే వేడుకకు రావడంతో కారణం అది కాదని పర్సనల్ ఫ్యామిలి రీజన్ అయ్యుండొచ్చని కామెంట్స్ వస్తున్నాయి.

నిహారిక కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన అన్నా లెజ్‌నేవా
అయితే పెళ్లికి హాజరు కాలేకపోయినప్పటికి అన్నా లెజ్‌నేవా పెళ్లి కూతురి కొసం ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఒక డ్రెస్ డిజైన్ చేయించి పెళ్లికి బహుమతిగా పంపినట్లు టాక్. ఇక నిహారిక కోసం పెళ్లి కానుకలు చాలానే వచ్చాయట. మెగా హీరోలు కూడా ఖరీదైన కానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బహుమతుల విలువ మొత్తం రూ.5కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.