For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైసీపీ నేతలకు చెప్పు‌తో పవన్ వార్నింగ్.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ స్లిప్పర్స్.. వాటి ఖరీదు ఎంతో తెలుసా?

  |

  జనవాణి కార్యక్రమానికి వైజాగ్ వెళ్లిన పవన్ కల్యాణ్‌ను ఏపీ ప్రభ్వుత్వం అడ్డగించడం వివాదంగా మారింది. రోజా, ఇతర మంత్రులపై జనసైనికుల దాడి నేపథ్యంలో ఐపీసీ 307 సెక్షన్‌తో కేసు నమోదు చేయడం మరింత వివాదంగా మారింది. వైజాగ్‌లో రెండు రోజులపాటు సాగిన హైడ్రామా విజయవాడకు చేరుకొన్నది. విజయవాడలో నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన వరుస సమావేశాల్లో పవన్ కల్యాణ్ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలను ఉద్దేశించిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి లోనయ్యాయి. ఈ సందర్భంగా పవన్ చూపించిన చెప్పు గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

   పవన్ కల్యాణ్‌ను ప్యాకేజ్ స్టార్ అంటూ

  పవన్ కల్యాణ్‌ను ప్యాకేజ్ స్టార్ అంటూ

  గత కొద్దికాలంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ నేతలు ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ కల్యాణ్ నడుచుకొంటున్నారు. చంద్రబాబుతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. పవన్ కల్యాణ్ పార్ట్ టైం పొలిటిషియన్ అంటూ వైసీపీ వర్గాలు టార్గెట్ చేశారు.

  వైజాగ్‌లో పవన్ పర్యటన గందరగోళం

  వైజాగ్‌లో పవన్ పర్యటన గందరగోళం

  అయితే జనవాణి కార్యక్రమం కోసం పవన్ కల్యాణ్ వైజాగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్ వరకు జరిగిన ర్యాలీకి అడుగడుగన అడ్డంకులు కల్పించారు. రెండు రోజులపాటు నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకొన్నారు.

   వైసీపీ నేతను దవడ పగిలేలా

  వైసీపీ నేతను దవడ పగిలేలా

  విజయవాడలో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే.. సహించేది లేదు. ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసులు ఎవరు.. చెప్పుతీసుకొని కొడుతా ఒక్కోక్క వైసీపీ నేతను. దవడ వాచిపోయేలా.. చెప్పు తీసుకొని కొడుతాను. తమాషాలుగా ఉందా? కొడుకుల్లారా? ఇంకోసారి ప్యాకేజీ.. గీకేజ్ అంటే.. చెప్పు తీసుకొని.. పళ్లు రాలకొడుతాను కొడుకుల్లారా? చవటల్లారా? దద్దమ్మల్లారా.. నా సహనమే మిమ్మల్ని రక్షించిందంటూ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

  పవన్ కల్యాణ్ చూపించిన చెప్పు ఫోటో

  పవన్ కల్యాణ్ చూపించిన చెప్పు ఫోటో

  వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ చూపించిన చెప్పు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, జనసైనికులు ఆ ఫోటోను, పవన్ కల్యాణ్‌ స్పీచ్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. దాంతో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా ట్రెండ్ అవుతున్నాయి.

  యూకేకు చెందిన ఫిట్‌ఫ్లాప్

  యూకేకు చెందిన ఫిట్‌ఫ్లాప్

  ఇక పవన్ కల్యాణ్ ధరించిన చెప్పుల విషయం, దాని ధర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. కొన్ని ఈ కామర్స్ సైట్స్ ఏకంగా పవన్ కల్యాన్ స్లిప్పర్స్ అంటూ అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. యూకేకు చెందిన ఫిట్‌ఫ్లాప్ సంస్థ సాండల్స్‌ను పవన్ వినియోగిస్తాడు. అత్తారింటికి దారేది సినిమా నుంచి ఈ బ్రాండ్ చెప్పులను పవన్ వాడుతున్నాడు. ఈ చెప్పుల ధర సుమారు 63 డాలర్లు అంటే.. సుమారు 6000 రూపాయలకుపైనే అనేది స్పష్టమవుతున్నది.

  ఆన్‌లైన్ భారీగా అమ్మకాలు..

  ఆన్‌లైన్ భారీగా అమ్మకాలు..

  పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యల తర్వాత ప్రస్తుతం ఈ బ్రాండ్ సాండల్స్‌ ఆన్‌లైన్‌ భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. ఈ బ్రాండ్ అమ్మకాలు గత రెండు రోజులుగా ఆన్‌లైన్ ఊపందుకొన్నాయి. ఫ్యాన్స్ ఈ బ్రాండ్ చెప్పుల గురించి ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ క్రేజ్ అంటే ఇది కాదా అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan's Fitflop Footwear trending in E commerce Websites. After Power star's ferocious speech on YSRCP leaders in Vijayawada, Online searches are goes huge.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X