Don't Miss!
- News
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి నిరసనసెగ.. ఆగ్రహించిన ఎమ్మెల్యే, టార్గెట్ చేసిన టీడీపీ!!
- Lifestyle
మీరు నిద్ర లేచిన వెంటనే కడుపు నొప్పిగా ఉందా? అయితే జాగ్రత్త వహించండి
- Technology
JioGamesWatch స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన జియో!! లైవ్ గేమింగ్ కంటెంట్‌తో
- Sports
కింగ్ ఈజ్ బ్యాక్.. పాకిస్థాన్‌కు దబిడి దిబిడే! 100వ మ్యాచ్‌లో చుక్కలే.. కోహ్లీ ఫ్యాన్స్ ధీమా!
- Finance
Super Offer: నిద్రపోయినందుకు బోలెడంత జీతం.. కంపెనీ సూపర్ ఆఫర్.. పోటీపడి దరఖాస్తులు..!
- Automobiles
భారత్‌లో పోలారిస్ రేజర్ ప్రో ఆర్ స్పోర్ట్ RZR Pro R Sport విడుదల.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనాపాజిటివ్.. త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ప్రార్థన
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. సాధారణ పౌరుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడుతున్నారు. పార్లమెంట్‌లో విధులు నిర్వహించే సిబ్బందిలో ఏకంగా 875 మంది కోవిడ్ బారిన పడినట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో పనిచేసే 2847 మందికి కరోనావైరస్ టెస్టులు జరుపగా.. 875 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇలాంటి వార్తల మధ్య ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

తనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతికి సంబంధించిన ట్విట్టర్ ఖాతా నుంచి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉన్న వెంకయ్య నాయుడు గారికి కరోనావైరస్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. వారం రోజులపాటు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించనున్నారు. తనతో సన్నిహితంగా మెదిలిన వారు కరోనావైరస్ పరీక్షలు చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ట్వీట్‌లో వెల్లడించారు.
కరోనావైరస్ బారిన పడిన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ భగంతుడిని ప్రార్థించారు. ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్.వెంకయ్య నాయుడు గారు కరోనాకు గురి కావడం విచారకరం. శ్రీ వెంకయ్య నాయుడు గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.