twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలపై పవన్ సంచలన నిర్ణయం.. ఆసక్తిగా లేదంటూ

    |

    Recommended Video

    Pawan Kalyan Gave A Clarity To The People About Future Politics!! | Oneindia Telugu

    సినిమాల్లో ఆయన పవర్ స్టార్.. పైగా మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో.. అంతేలేని అభిమాన వర్గం కానీ రాజకీయాల్లోకి వచ్చే సరి అట్టర్ ప్లాప్.. ఇదీ పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ సిచ్యువేషన్. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపడానికి తనకు అవకాశమివ్వండంటూ రాజకీయ గడప తొక్కిన పవన్‌ని పట్టించుకున్న నాధుడే లేడు. దీంతో ఇక పవన్ సినిమాల్లోకి వస్తున్నాడనే వార్తలు వెల్లువెత్తాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ వివరాలు చూస్తే..

    మొదటి ఎన్నికల్లోనే ఘోర పరాజయం

    మొదటి ఎన్నికల్లోనే ఘోర పరాజయం

    పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచింది జనసేన. 2019 ఎన్నికలే జనసేనకు మొదటి ఎన్నికలు. కానీ ఈ ఎన్నికల్లో ఇక లేవడం కష్టమే అన్నట్లుగా కూలబడిపోయింది జనసేన పార్టీ. కనీసం అధినేత పవన్ కళ్యాణ్ గానీ, ఆయన అన్నయ్య మెగా బ్రదర్ నాగబాబు గానీ విజయం సాధించకపోవడం జనసేన స్టామినా ఏంటో తెలిపాయి.

    ఇక సినీ లోకమే బెటర్

    ఇక సినీ లోకమే బెటర్

    ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఓటమి చూసిన ఆయన అభిమానులు, ప్రజలు ఇక ఆయనకు సినీ లోకమే బెటర్ అనే ఫీలింగ్ కి వచ్చేశారు. ఈ లోగానే బండ్ల గణేష్ నిర్మాతగా బోయపాటి దర్శకత్వంలో పవన్ రీ ఎంట్రీ అనే వార్తలు పుట్టుకొచ్చేశాయి. దీంతో అన్నయ్య చిరు లాగే పవన్ కూడా వెనుకడుగేసినట్లే అని భావించారంతా.

    పవన్ సంచలన నిర్ణయం

    పవన్ సంచలన నిర్ణయం

    తాజాగా వస్తున్న వార్తలు, జరుగుతున్న పరిణామాలు దృష్టిలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ సంచలన నిరన్యం తీసుకున్నారు. తాను ఇక సినిమాలు చేసే ప్రసక్తే లేదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు. ఇది వరకే ఓ సందర్భంలో ఇదే మాట చెప్పిన పవన్.. ఎన్నికల అనంతరం మళ్లీ అదే మాటను రిపీట్ చేయడంతో జనసేన పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

    పవన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత

    పవన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత

    తాను ఇక సినిమాలు చేసే ప్రసక్తే లేదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా రాబోయే 25 ఏళ్లు ప్రజల కోసమే పనిచేస్తానని పవన్ పేర్కొనడం ఆయనలో ఉన్న పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది.

    గెలిచిన ఆ ఒక స్థానం కూడా

    గెలిచిన ఆ ఒక స్థానం కూడా

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానమే గెలుచుకుంది. ఆ ఒక్క స్థానం లోని అభ్యర్థి సైతం వైసీపీ వంక చూస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే జనసేన పరిస్థితి నది సంద్రంలో నావనే!. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జనసేనాని పవన్ మాట్లాడే మాటలు ఎంతవరకు నెరవేర్చుకోగలుగుతాడో చూద్దాం.

    English summary
    Since one week some news viral on Pawan Kalyan's re entry into the movies. In this issue Pawan Kalyan gave a clarity to the people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X