Don't Miss!
- News
ఒక్క ఛాన్స్ - ఒక్క తప్పిదం : అనుభవిస్తున్నారు - ఆలోచించండి : బాలయ్య..!!
- Technology
WhatsApp లో కొత్త రకం స్కామ్! ఈ నంబర్లు డయల్ చేసారంటే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. జాగ్రత్త.
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- Lifestyle
అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ వారు బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం మీకు తెలుసా?
- Sports
Jos Buttler Records In Qualifier 2: జోస్ ది బాస్ దెబ్బకు పిట్టల్లా రాలిన రికార్డులు.. డేంజరేస్ ప్లేయర్ మరీ!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ నటుడి డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్.. దిమ్మతిరిగే కథతో పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలని టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలో కూడా ఎందరో డైరెక్టర్లు కలలు కంటుంటారు. కానీ ఆ అవకాశం అతికొద్ది మందికే దక్కుతుంది. అయితే దక్షిణాదిలో అగ్రనటుడిగా విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సముద్రఖనికి ఆ అవకాశం లభించడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తన డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్‌తో సినిమా గురించి సముద్రఖని క్లారిటీ ఇస్తూ..

నేను పవన్ కల్యాణ్ అభిమానిని
పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త. నేను పవన్ కల్యాణ్‌కు అభిమానిని. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. అభిమానుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఆయనతో సినిమా తీస్తాను. త్వరలోనే పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేసే సినిమా గురించి వివరాలు వెల్లడిస్తాను అని సముద్రఖని అన్నారు.

పవన్‌తో తమిళ సినిమా రీమేక్
తమిళంలో
తాను
డైరెక్షన్
వహించిన
వినోదయ
సీతం
సినిమాను
తెలుగులో
రీమేక్
చేయడానికి
ప్లాన్
జరుగుతున్నది.
తెలుగు
రీమేక్
సినిమాకు
సముద్రఖని
దర్శకత్వం
వహిస్తారు.
ఈ
చిత్రంలో
పవన్
కల్యాణ్‌తో
సాయిధరమ్
తేజ్
కూడా
కలిసి
నటిస్తారు
అనేది
తాజా
సమాచారం.

వినోదయ సీతం కథ ఏమిటంటే?
వినోదయ
సీతం
సినిమా
కథ
విషయానికి
వస్తే..
సమాజంపై
ప్రభావితం
చూపే
ఓ
వ్యక్తి
అనుకొని
పరిస్థితుల్లో
విషాదకరంగా
ఓ
కారు
యాక్సిడెంట్‌లో
మరణిస్తాడు.
అయితే
ఆయన
కోరిక
మేరకు
మరో
90
రోజులు
భూమిపై
బతికేందుకు
యమధర్మరాజు
అనుమతిస్తాడు.
అయితే
90
రోజుల్లో
సమాజంలో
ఉన్న
సమస్యలను
ఏ
విధంగా
పరిష్కరించాడు
అనేది
ఈ
సినిమా
కథ.

తివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి
గతేడాది తమిళంలో వినోదయ సీతం సినిమా రిలీజ్ అయింది. తెలుగు రీమేక్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగు రీమేక్ చేయగా త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు సహకరించిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు చేర్పులు త్రివిక్రమ్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

జూలైలో సెట్స్‌పైకి మూవీ
వినోదయ
సీతం
సినిమా
తెలుగు
రీమేక్‌లో
సముద్రఖని,
తంబి
రామయ్య,
మునీష్
కాంత్
తదితరులు
నటించనున్నారు.
ఇంకా
ఈ
సినిమాలో
నటీనటులు,
సాంకేతిక
నిపుణుల
వివరాలను
త్వరలోనే
వెల్లడించేందుకు
ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
అన్ని
కుదిరితే..
ఈ
సినిమా
జూలైలో
సెట్స్‌పైకి
వెళ్లే
అవకాశం
ఉంది.