twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఆలోచన గొప్పది.. ఎన్నటికీ మరచిపోలేము.. అల్లు అర్జున్‌పై సీఎం ప్రశంసలు

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అస్తవ్యస్తమైంది. విరుగుడు లేని ఈ వైరస్ ప్రపంచదేశాలపై విరుచుకు పడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం కూడా అతలాకుతలం అవుతోంది. మన దేశంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు మన ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి.

    కరోనా కట్టడికి లాక్ డౌన్..

    కరోనా కట్టడికి లాక్ డౌన్..

    శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ విధించింది. ఈ మేరకు 21 రోజుల పాటు ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. దీంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. వీరిని ఆదుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.

    ప్రభుత్వాలకు అండగా..

    ప్రభుత్వాలకు అండగా..

    కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. అయితే ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ సెలెబ్రిటీలు మానవత్వాన్ని చాటి చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు టాలీవుడ్ సెలెబ్రిటీలెందరో ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

    మూడు రాష్ట్రాలకు ఆర్థిక సాయం..

    మూడు రాష్ట్రాలకు ఆర్థిక సాయం..

    అయితే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం మూడు రాష్ట్రాలకు సాయాన్ని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున కోటి రూపాయలు, తనను ఎంతగానో ప్రేమించే కేరళ ప్రజల కోసం.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.25 లక్షలను ప్రకటించాడు.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
    ఆ ఆలోచన గొప్పది..

    ఆ ఆలోచన గొప్పది..

    కరోనా కట్టడిలో భాగంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అల్లు అర్జున్ విరాళం అందించడంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఈ సహాయానికి కేరళ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని, తెలుగు రాష్ట్రాలతో పాటు తమ రాష్ట్రాన్ని కూడా ఆదుకోవాలన్న ఆలోచన చాలా గొప్పదని అల్లు అర్జున్‌ను కొనియాడారు. ఈ ఆపత్కాలంలో అల్లు అర్జున్ చేసిన ఈ సాయాన్ని కేరళ ప్రజలు ఏనాటికీ మరచిపోరని పేర్కొన్నారు.

    English summary
    Pinarayi Vijayan Praised Allu Arjun. Kerala Chief Minister Pinarayi Vijayan has lauded the humanitarian aspect of the actor towards three states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X