Just In
Don't Miss!
- News
SP Balu "భారత రత్నం" కాడా..? పద్మవిభూషణ్‌తో సరిపెట్టిన కేంద్రం
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Finance
ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా ఫ్యాన్స్‌కి శుభవార్త: మళ్ళీ కెమెరా ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సెట్స్‌పై ఇలా! ఫోటో లీక్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ సొంత స్థాపించిన పవన్ మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నాడని, సినిమాలు- రాజకీయాలు ఏకకాలంలో ముందుకు తీసుకెళ్లనున్నారని గత కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చేశారు. ఆ పిక్ కూడా లీక్ కావడంతో విషయం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

ఏపీ రాజకీయాలు.. వెండితెరపై ఓ కన్ను
'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత సినీ రంగానికి కొంత విరామం ఇచ్చిన పవన్.. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయ్యాడు. జనసేన పార్టీ స్థాపించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న ఆయన తిరిగి వెండితెరపై ఓ కన్నేశారు. ఈ మేరకు బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు.

‘పవన్ కళ్యాణ్ లీడ్ రోల్.. దిల్ రాజు నిర్మాణం
హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాకు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

రాజకీయాల్లో బిజీ బిజీ.. ఇప్పుడిలా
ఈ రోజే (జనవరి 20) హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. తొలిరోజే పవన్ కల్యాణ్ సెట్‌కి రావడం విశేషం. గత రెండేళ్ల నుంచి రాజకీయాలతో బిజీ బిజీగా గడిపిన పవన్.. తిరిగి సెట్స్ మీదకు రావడంతో అంతా ఆసక్తిగా చూశారు.

సెట్స్ పవన్ ఇలా.. పిక్ లీక్
ఇదిలా ఉంటే సెట్స్ మీదకు పవన్ వచ్చి రాగానే చుట్టుపక్కల జనం తమ చేతిలోని సెల్ ఫోన్లకు పని చెప్పారు. ఆయన ఫోటోలు తీశారు. ఈ పిక్స్ ఆన్‌లైన్ వేదికల్లో అప్‌లోడ్ చేయడంతో వెంటనే వైరల్ అయ్యాయి. ఈ పిక్స్‌లో గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్.

10 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పవన్
'పింక్' రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడంతో పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. 10 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. ఆ తర్వాత పవన్ కి బ్రేక్ ఇచ్చి ఇతర నటీనటులతో సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఫిబ్రవరిలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్.

పవన్ సరసన హీరోయిన్.. మేకర్స్ ప్లాన్
ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. దీనికి 'లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించనున్నారు. పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్.