For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లుంగీలో భీమ్లా నాయక్ మాస్ ఎంట్రీ.. దేవర దెబ్బ బాబుల్ గాడి అబ్బా, పూనకాలే !

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిజానికి ఆయన రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయడంతో ఇక సినిమాలకు దూరం అవుతారని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. స్వయంగా పవర్ స్టార్ రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన పార్టీ నుంచి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎన్నికై శాసనసభకు వెళ్లారు.

  ఇప్పుడు ఆయన కూడా ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలోనే పవన్ తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగానే ఆయన దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన అనేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  power star pawan kalyan Rana combo Movie Title And First Glimpse On 15th August

  అలా అనౌన్స్ చేసిన సినిమాల్లో ఒకటి అయ్యప్పనుం కోషియమ్‌ . పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ దగ్గుబాటి రానాతో కలిసి మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నాడు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన... అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది.

  అయితే సెకండ్ వేవ్ ఆంక్షలు సడలించిన తరువాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా మేకింగ్ వీడియో కూడా సినిమా యూనిట్ రీలిజ్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు.

  power star pawan kalyan Rana combo Movie Title And First Glimpse On 15th August

  అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. భీమ్లా నాయక్ నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15న ఈ సినిమా యూనిట్ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ మరియు ఈ సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ లుంగీ కట్టుకుని ఉన్న ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకుని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది.

  ఇక తాజా అప్డేట్ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి బ‌రిలో నిలుస్తున్న ఈ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌ళ్లీ ఆయన పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నుండ‌టంతో ఖచ్చితంగా హిట్ కొడతామని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ప‌వ‌న్ కు జోడీగా సాయిప‌ల్ల‌వి, రానాకు జోడీగా ఐశ్వ‌ర్య‌రాజేశ్ క‌నిపించ‌నున్నారు. అలాగే రఘుబాబు, బ్రహ్మాజీ, రవీంద్ర విజయ్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

  English summary
  Makers of Pawan Kalyan and Rana Daggubati’s next revealed that the film’s title and first glimpse will be unveiled on August 15.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X