Prabhas21 షూట్ గ్రాండ్‌గా ప్రారంభం.. అమితాబ్ బచ్చన్‌పై తొలిషాట్.. బిగ్ బీ ట్వీట్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఇంటర్నేషనల్ స్థాయి ప్రాజెక్ట్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ షూటింగ్ ప్రారంభోత్సం గురించి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ షూటింగ్ ప్రారంభోత్సవం గురించి వివరాల్లోకి వెళితే...

Prabhas21 ప్రాజెక్ట్ క్రేజీగా
ప్రభాస్ కెరీర్‌లో 21వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Prabhas21 గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదకోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, లాక్‌డౌన్, కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

Prabhas21 ముహుర్తపు షాట్
అయితే కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో Prabhas21 మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జూలై 24 శనివారం షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజు షూట్‌లో బిగ్ బీ అమితాబ్, ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

అమితాబ్ ట్వీట్ వైరల్
Prabhas21, నాగ్ అశ్విన్ ప్రాజెక్టు గురించి అమితాబ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఒక సరికొత్త వాతావరణంతో కూడిన కొత్త సినిమా షూటింగు ప్రారంభం కానున్నది. జూలై 24 రోజున జరిగే ముహుర్తపు వేడుకు నేను ప్రయాణం చేస్తున్నాను. కొత్త అనేది ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టు అద్బుతంగా ఉంటుంది అని అమితాబ్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లోనే అమితాబ్
Prabhas21 చిత్రంలో అమితాబ్ బచ్చన్ పూర్తిస్థాయిలో కీలక పాత్రను పోషిస్తున్నారు ఈ సినిమా కోసం భారీగా కాల్షిట్స్ కేటాయించారు. ఈ షెడ్యూల్ అలాగే, పాత్ర పూర్తయ్యేంత వరకు అమితాబ్ హైదరాబాద్‌లోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. బిగ్ బీ కోసం నిర్మాత అశ్వినిదత్ పూర్తి ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

ప్రభాస్ లేకుండానే
ఇక Prabhas21 ప్రాజెక్టు ముహుర్తపు వేడుక ప్రభాస్ లేకుండానే ప్రారంభించారు. ముందస్తు కార్యక్రమాల వల్ల ప్రభాస్ ఈ వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ వేడుకను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ముహుర్తపు షాట్‌లో అమితాబ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు అని తెలిసింది.
Recommended Video

500 కోట్లతో భారీగా
ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూలేని విధంగా బాహుబలిని మించిన ప్రాజెక్ట్‌ను నిర్మాత అశ్వినీదత్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను ప్యాన్ వరల్డ్ చిత్రంగా రూపొందిస్తున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమాను సుమారు 500 కోట్లతో రూపొందించేందుకు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











