twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయాందోళన పరిస్థితి.. సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి: కరోనాపై ప్రభాస్

    |

    కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145 కు పైగా దేశాల్లో పాగా వేసి వేలాదిమందికి బలిగొంది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కొన్ని సూచనలు ఇస్తున్నారు.

    ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సహా కొందరు స్టార్స్ కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ రెబల్ స్టార్ రియాక్ట్ అవుతూ ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు.

    COVID-19 వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, తద్వారా దాని నుండి తప్పించుకోవచ్చని అన్నారు ప్రభాస్. ప్రస్తుతం ఉన్న భయాందోళన పరిస్థితిని అందరూ సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని కోరుతూ ప్రభాస్ ట్వీట్ చేశారు.

    Prabhas Comments on CoronaVirus

    ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జార్జియా షెడ్యూల్ పూర్తిచేసిన ఆయన తిరిగి ఇండియా వస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నామని ప్రకటించింది చిత్రయూనిట్.

    English summary
    Prabhas recent release Saaho, directed by Sujeeth, failed to live up to everyone's expectation. After Saaho, the actor is now concentrating on his upcoming film with Radha Krishna Kumar. Now he was reacted on Coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X