Mirai: మిరాయ్‌లో ప్రభాస్.. ఊహించని ఎంట్రీతో హైప్ పెంచేసిన బాహుబలి

హనుమాన్ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ తర్వాత తేజ సజ్జా నటించిన చిత్రం మిరాయ్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి తెరకెక్కించారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 12న మిరాయ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు విదేశాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. దీంతో మిరాయ్‌కి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మిరాయ్ బడ్జెట్ ఎంత?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మిరాయ్ చిత్రాన్ని నిర్మించారు. మంచు మనోజ్, శ్రీయ సరన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి మిరాయ్‌కి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో తేజ సజ్జా మూవీకి థియేట్రికల్, శాటిలైల్, ఓటీటీ, ఆడియోతో కలిపి దాదాపు 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ టాక్. అంచనాలకు తగిన విధంగానే మిరాయ్ అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 2 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో 1.70 కోట్ల రూపాయలు) రాబట్టి హనుమాన్ రికార్డుల్ని దాటేసింది.

Prabhas in Teja Sajja s Mirai rebellious surprise for darling fans

మిరాయ్‌లో రెండు సర్‌ప్రైజ్‌లు
కాగా.. మిరాయ్ ఈవెంట్ సందర్బంగా ఈ సినిమాలో రెండు స్పెషల్ సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని తేజ సజ్జా ప్రకటించారు. దాంతో అవి ఏమై ఉంటాయా? అని ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యారు. ఎవరైనా పెద్ద స్టార్లు మిరాయ్‌లో గెస్ట్ రోల్స్ లాంటివి చేసి ఉండొచ్చని కథనాలు వచ్చాయి. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, రవితేజ వంటి వార్లు క్యామియో రోల్స్ చేసి ఉండొచ్చిన పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా మిరాయ్ రిలీజ్‌కు ముందు ఈ సస్సెన్స్‌కు తెరదించాడు తేజ సజ్జా. ఓ ట్వీట్‌తో విషయం మొత్తం చెప్పేశాడు.

రెబలియస్ సర్‌ప్రైజ్
కొద్దిగంటల్లో మిరాయ్ మీ ముందుకు రాబోతోంది.. పెద్ద మనసున్న ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. సినిమా స్టార్టింగ్‌లో రెబలియస్ సర్‌ప్రైజ్ మిస్ అవ్వొద్దని ట్వీట్ చేశారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా రాజు అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, మిరాయి బిగ్‌నింగ్ మిస్ కావొద్దని ట్వీట్ చేయడంతో ప్రభాస్ ఖచ్చితంగా గెస్ట్ రోల్ పోషించి ఉంటారని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిట్ అయ్యారు. కట్ చేస్తే మిరాయి ప్రీమియర్స్ చూసిన అభిమానులు.. ఈ చిత్రంలో ప్రభాస్ గురించి ట్విస్ట్ రివీల్ చేశారు.

ప్రభాస్ సర్‌ప్రైజ్ ఎంట్రీ
మిరాయ్ బిగినింగ్‌లో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన బేస్ వాయిస్‌‌తో థియేటర్లు దద్ధరిల్లిపోయాయి. చివరిలో రానా దగ్గుబాటి విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పించినట్లుగా నెటిజన్లు ట్వీట్ చేశారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి బాహుబలి వారసత్వాన్ని వాడుకోవాలన్నది టాలీవుడ్ వ్యూహం కావొచ్చు.. ఇది మిరాయ్ హైప్‌ని ఎలా పెంచుతుందో చూడాలంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నప్పలో గెస్ట్ రోల్ ద్వారా ఆ సినిమా క్రేజ్‌ని పెంచేసిన ప్రభాస్.. తాజాగా మిరాయ్‌లో వాయిస్ ఓవర్‌తో ఈ చిత్రంపై ఇప్పటికే ఉన్న హైప్‌ను మరింత పెంచేశారని అంటున్నారు. మరి ఆయన వాయిస్ ఓవర్ ఏమాత్రం ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: prabhas teja sajja mirai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X