Don't Miss!
- News
Budget 2023: మొత్తం బడ్జెట్లో 13 శాతం వాటా ఈ రంగానిదే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Project K: ప్రభాస్ మూవీకి అదిరిపోయే బిజినెస్ ఆఫర్.. నైజాంలో రికార్డుస్థాయిలో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి సినిమా తర్వాత టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత సి.అశ్విని దత్ వైజయంతి మూవీస్ లో ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు.
కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రాజెక్ట్ K సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడానికి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల అశ్విన్ దత్ నైజాం ఏరియా కు సంబంధించిన డీల్ ను క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ అలాగే నిర్మాత దగ్గుపాటి సురేష్ సంయుక్తంగా కలిసి ఈ సినిమా నైజాం హక్కులను దాదాపు 70 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక నైజాం ఏరియాలోనే సినిమా ఈ స్థాయిలో ధర పలుకుతుంది అంటే ఇంకా మిగతా ఏరియాలో అలాగే మిగతా భాషల్లో ఎంతవరకు బిజినెస్ చేసే అవకాశం ఉందో ఊహలకు అందడం లేదు.
తప్పకుండా సినిమా అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మూడో విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక మేయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయ్యింది. ఇక మిగిలిన షూటింగ్ ను అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఇదే ఏడాది పూర్తి చేసుకుని 2024లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.