పీకల్లోతు అప్పుల్లో రాజమౌళి... షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ప్రభాస్

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో టాప్ ప్లేస్‌లో నిలుస్తారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తన దర్శకత్వ ప్రతిభతో వెండితెరపై అద్భుతమైన చిత్రాలను రూపొందించిన జక్కన్న.. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతి సాధించి పెట్టారు. 25 ఏళ్ల కెరీర్‌లో తీసింది 13 సినిమాలే అయినా ఎవ్వరూ సాధించలేని ఘనతలను తన ఖాతాలో వేసుకున్నారు. భారతీయ దర్శక దిగ్గజంగా, ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి జక్కన్న అప్పులతో ఇబ్బందిపడ్డారట.. ఈ విషయాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ రేంజ్ పెంచిన రాజమౌళి
మగధీర, ఈగ, బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో దానిని మరో మెట్టు పైకెక్కించారు. ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించి అరుదైన ఘనతను అందుకున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు వందల కోట్లు కుమ్మరించేందుు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ బడా నిర్మాతలు రెడీగా ఉన్నారు. రాజమౌళి సినిమాలో చిన్న ఛాన్స్ దొరికినా చాలని అనుకునే స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ 29 మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. పాన్ ఇండియా కాన్సెప్ట్‌కు ఆద్యుడిగా నిలిచిన ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారట.

Prabhas revealed SS Rajamouli s Debts in Baahubali The Epic Movie promotion

ఇండియాలో టాప్ డైరెక్టర్‌‌గా ఘనత
రాజమౌళి సినిమాకు 100 నుంచి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని ఇండస్ట్రీలో వినిపించే మాట. లాభాల్లో వాటా, ఏరియాల హక్కులు వంటి వాటితో జక్కన్న రెమ్యునరేషన్ ఇండియాలో ఏ డైరెక్టర్ అందుకోని స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో తెరకెక్కిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తీసుకునేలా నిర్మాతలతో జక్కన్న ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇలాంటి క్రేజ్ సంపాదించిన రాజమౌళి.. పీకల్లోతు అప్పుల్లో ఉన్నారట... ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ బయటపెట్టారు.

ప్రేక్షకుల ముందుకు బాహుబలి ది ఎపిక్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల్ని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రీ రిలీజ్ అయినప్పటికీ రాజమౌళి తన మార్క్ ప్రమోషనల్ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి ఓ ఫన్నీ ఇంటర్వ్యూ పెట్టుకున్నారు. బాహుబలి మేకింగ్, నాటి జ్ఞాపకాలను ముగ్గురు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి పార్ట్ 1 రిలీజ్ సందర్భంగా పడిన టెన్షన్ గురించి రాజమౌళి ప్రస్తావించారు.

అలాంటి కామెంట్స్‌ చేశారు
బాహుబలి ది బిగినింగ్ రోజు ఉదయం 4 గంటలకి డిజాస్టర్ షాక్ టాక్ వచ్చింది. నేను మరీ అంత బ్యాడ్‌గా సినిమా తీయలేదు. డైరెక్టర్‌గా ఫెయిల్ అయ్యానేమో అనుకున్నా.. కానీ లోపల చిన్న ఓ 10 శాతం హోప్ ఉండేది. అప్పట్లో 12 ఏళ్ల క్రితం ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది.. ప్రెస్ జర్నలిస్టులు, పీఆర్వోలు అందులో ఉండేవారు. అందులో ఎలా జాయిన్ అయ్యిందో ఏంటో వదిన పేరు (వల్లి) జాయిన్ అయిపోయింది. 130 నుంచి 150 మంది ఉండేవారు. అందులో ఈమె ఎవరో చెక్ చేయలేదు.. అందులో మెసేజ్‌లు వస్తున్నాయి.. ఫస్ట్ మెసేజ్ ప్రభాస్ శివలింగం ప్లేస్‌లో జండూ బామ్ పెట్టి వీళ్లు పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? ఎంత పొగరు ఒక్కొక్కరికి? అంత గొప్ప సినిమా తీశామని అనుకుంటున్నారా? అయిపోయారు.. ఇది బాహుబలి కాదు, ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ఎగ్జిబిటర్ బలి అనే కామెంట్స్ వచ్చాయని రాజమౌళి గుర్తుచేసుకున్నారు.

మూడు రోజులు వణికిపోయా
ఈ మెసేజ్‌లను మాకెవ్వరికీ చెప్పకుండా వదిన ఒక్కతే చూస్తోంది. మాకు ఇవన్నీ తర్వాత చెప్పింది. తర్వాత నిర్మాత సాయిగారు వచ్చి టాక్ గురించి పట్టించుకోవద్దు, ఉద్ధృతంగా ఉన్నాయి కలెక్షన్స్. అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్ షోకి పెరగవని, టికెట్లు సప్లయ్ చేయలేక చచ్చిపోతున్నాం, దద్ధరిల్లిపోతోందని సాయి చెప్పారు. ముందు నుంచి ఉన్న భయం కారణంగా శనివారం, ఆదివారం కూడా వెయిట్ చేద్దామని అనుకున్నా. సండే ఈవినింగ్ అందరం కలిశామని రాజమౌళి చెప్పారు.

సార్‌కి అన్నీ అప్పులే
మరి ఆ టైంలో మీకు ఏం చేయాలని అనిపించిందని ప్రభాస్ ప్రశ్నించగా.. నేను డైరెక్టర్‌ని డబ్బులు పెట్టినోడిని కాదు, మళ్లీ ఇంకో సినిమా తీస్తే డబ్బులు వస్తాయి. శోభు గారి పరిస్దితి ఏంటీ? నన్ను నమ్మి పెట్టేశారు.. ఏం చేస్తాం, నా దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నారు రాజమౌళి. దాంతో ప్రభాస్ జోక్యం చేసుకుని.. సార్ దగ్గర ఏం లేవు, మొన్నటి దాకా అప్పులు కట్టుకుంటూ ఉన్నారు. ఈయన స్టోరీలు నాకు తెలుసు కదా అని ప్రభాస్ చెప్పడంతో రానా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతుండగా.. రాజమౌళి అంతటి టాప్ డైరెక్టర్ అప్పుల్లో ఉండటం ఏంటీ? వడ్డీలు కట్టుకుంటూ ఉండటం ఏంటీ? అని కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X