Prabhas review on Kantara రెండుసార్లు చూశా, గ్రేట్ కాన్సెప్ట్.. థ్రిల్లింగ్ క్లైమాక్స్.. ప్రభాస్ ప్రశంసల వర్షం
కన్నడ సినీ పరిశ్రమలో కేజీఎఫ్ తర్వాత కంతారా మూవీ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. కన్నడ వెర్షన్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో రిలీజైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మైమరిపించాడు. ఈ సినిమాను రెండుసార్లు చూశానని ప్రభాస్ తెలియజేస్తూ.. సినిమాపై రివ్యూను ఎలా ఇచ్చారంటే..

ఏప్రిల్ 30న కన్నడ వెర్షన్ రిలీజ్
కంతారా చిత్రం ఏప్రిల్ 30వ తేదీన కన్నడ వెర్షన్ దేశవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా అన్ని భాషల, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. డైరెక్టర్‌గా రిషబ్ టేకింగ్.. యాక్టర్‌గా ఆయన నటనపై భారీగా ప్రశంసలను ప్రేక్షకులు, సినీ విమర్శకులు గుప్పిస్తున్నారు.

టాప్ కలెక్షన్లు సాధించిన మూవీగా
కన్నడ సినిమా పరిశ్రమలో కంతారా చిత్రం అరుదైన స్థానాన్ని సంపాదించుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా ఈ సినిమా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. కేజీఎఫ్, కేజీఎఫ్2, జేమ్స్, వీఆర్, చార్లీ తర్వాత కంతారా సినిమా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నది.

100 కోట్లకు చేరువగా
విష్ణుతత్వం ఆధారంగా రూపొందిన కంతారా చిత్రం కేవలం సినీ, ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం 14వ రోజున కూడా 4.15 కోట్ల భారీ వసూళ్లను దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు కన్నడ వెర్షన్ సుమారు 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రెండోవారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.

ఏప్రిల్ 15న తెలుగు డబ్బింగ్ రిలీజ్
దేశవ్యాప్తంగా కంతారా సినిమాకు వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ప్రాంతీయ భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. హిందీ డబ్బింగ్ కంతారా ఏప్రిల్ 14వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ 15వ తేదీన విడుదల అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చేసిన ఇన్స్‌టాగ్రామ్ పోస్టు వైరల్ అయింది.
ప్రభాస్ ఏం చెప్పారంటే?
కంతారా తెలుగు డబ్బింగ్ సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు ప్రభాస్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో భారీగా ప్రశంసలు గుప్పించారు. నేను కంతారా సినిమాను రెండోసారి కూడా చూశాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు అద్బుతమైన అనుభూతిని కలిగించింది. గొప్ప కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. క్లైమాక్స్ మాటలకు అందని విధంగా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి అంటూ ప్రభాస్ తన పోస్టులో చెప్పారు.


Click it and Unblock the Notifications











