Billa 4K collections నాన్న కల సాకారం కోసం.. కలెక్షన్లు ఆ ఫౌండేషన్‌కే.. ప్రభాస్ చెల్లెలు ఎమోషనల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం నటించిన బిల్లా. అనుష్క హీరోయిన్‌గా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. ఈ స్టైలిష్
యాక్షన్ మూవీ ఈ నెల 23న 4K వెర్షన్ లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ...ఈ సినిమా సంగీతం సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందే. బిల్లా వంద రోజుల తర్వాత తమిళంలో హీరో విజయ్ తో ఓ సినిమా చేసేందుకు వెళ్లాను. కథ విన్నాక మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడని అడిగితే మీ బిల్లా పాటలన్నీ మాకు ఇచ్చేయండి ఈ సినిమాలో పెట్టుకుంటాం. అన్నారు. బిల్లా పాటల క్రేజ్ అలాంటిది. ఈ సినిమా మళ్లీ విడుదలవడం సంతోషంగా ఉంది. అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...ప్రభాస్ గారి ఇమేజ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇలాంటి సమయంలో వరల్డ్ వైడ్ గా బిల్లా చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణంరాజు గారి కీర్తి ప్రతిష్టల్ని ప్రభాస్, ప్రసీధ ఆయన ఇతర కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నా. అన్నారు.
ప్రసీధ మాట్లాడుతూ...బిల్లా సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్ లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ ఈ మూవీ. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. నాన్నకు ఈ చిత్రాన్ని మళ్లీ అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే- ఇండియా డయోబెటిక్ ఫుట్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్న కృష్ణంరాజు గారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. మేము ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తాం అని ప్రసీద చెప్పారు.


Click it and Unblock the Notifications











