The Raja saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘ద రాజా సాబ్' రిలీజ్‌పై మూవీ మేకర్స్ క్లారిటీ !
The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతూన్న మోస్ట్ అవెయిటెడ్ హారర్ మూవీ ది రాజా సాబ్'. ఈ మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ పాన్ ఇండియా చిత్రం "ద రాజా సాబ్" (The Raja Saab) ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌పై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?
గత రెండు రోజులుగా "రాజా సాబ్" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని, అయితే.. చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందా? అనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ రూమర్స్ పై మూవీ మేకర్స్ స్పందించారు. స్వయంగా నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ "ఆ వార్తలు పూర్తిగా అసత్యం, ఆధారరహితం. 'ద రాజా సాబ్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ జరగనుంది. ఐమ్యాక్స్ సహా అన్ని ప్రధాన ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎలాంటి ఆలస్యం లేదు" అని స్పష్టంచేశారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన VFX, సౌండ్ డిజైన్, డబ్బింగ్, రీ-రికార్డింగ్ పనులు వేగంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 8 వ తేదీ నుంచి రీ రికార్డింగ్ వర్స్క్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హీరో తప్ప మిగతా నటీనటుల డబ్బింగ్ పూర్తయిందని తెలుస్తోంది. అలాగే కేరళ, యూరప్ షెడ్యూల్స్‌లో సాంగ్స్ షూట్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
మూవీ మేకర్స్ సమాచారం ప్రకారం.. డిసెంబర్ 25వ తేదీ నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ల కోసం కూడా భారీ ప్లానింగ్ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదనంగా, త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేసి ప్రమోషన్ వేగాన్ని పెంచనున్నారు. ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతున్న ఈ సినిమా హారర్-కామెడీ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది.
దర్శకుడు మారుతి, ప్రభాస్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా వింటేజ్ లుక్ లో చూపించారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్‌ను సృష్టించాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాటోగ్రఫీని కార్తీక్ పళని, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, ఫైట్స్‌ను రామ్-లక్ష్మణ్, కింగ్ సోలొమన్ డిజైన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి 2026లో జనవరి 9న విడుదలై కానున్నది. ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలువబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











