Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Prabhas 25 : సస్పెన్స్ పెంచేసిన టీసిరీస్.. రేసులో ముగ్గురు టాప్ డైరెక్టర్స్!
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోవడంతో ఆయన పూర్తిగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశారు. బాహుబలి తర్వాత స్నేహితులతో కలిసి నడుపుతున్న సొంత ప్రొడక్షన్ అయిన యువి ప్రొడక్షన్స్ సంస్థతో సాహో అనే సినిమా చేసి రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం అదే సంస్థతో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న ఆయన ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కాక ఇప్పటికే ఆయన వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ఆయన 25వ సినిమా గురించి రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు టీ సిరీస్ సంస్థ ఒక ప్రకటన చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

అన్నీ ప్యాన్ ఇండియా లెవల్లో
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగి పోయింది. మార్కెట్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో దాదాపు ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి పూర్తయిన వెంటనే ప్రభాస్ సాహో అనే సినిమా చేశారు. సుజిత్ దర్శకత్వంలో యు.వి.ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఊహించినంత ఆదరణ దక్కించుకోలేక పోయింది. కలెక్షన్లు బాగానే వచ్చిన సినిమా టాక్ మాత్రం పాజిటివ్ గా రాలేదు.

సాహో ఎఫెక్ట్
రాధేశ్యామ్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా అనేక మార్పులు చేర్పులు చేసిన రీ షూట్లు చేస్తూ వెళ్లడం, మధ్యలో కరోనా కూడా ఎంటర్ కావడంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ లేట్ అవుతోంది. ఇప్పటికి కూడా కొంత మేర ప్యాచ్ వర్క్ ఈ సినిమాకు మిగిలి ఉందని అంటున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.

వరుస సినిమాలు
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరో రెండు
ఇక ఇవి కాకుండా ఆయన నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె అని ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తుండగా ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తో మరో సినిమా కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజా ప్రచారం మేరకు ప్రభాస్ 25వ సినిమా ప్రకటన అక్టోబర్ ఏడవ తేదీన విడుదల కాబోతోంది.

ఏకంగా రేసులో ముగ్గురు
తాజాగా దీనికి సంబంధించి టీ సిరీస్ ఒక ప్రకటన చేసింది. రేపు ఒక పెద్ద ప్రకటన రాబోతోందని, తమ ట్విట్టర్ ఖాతాకు కనెక్ట్ అయి ఉండండి అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ 25వ సినిమా దర్శకుడు ఎవరు అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకంటే రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ఒక ప్రచారం జరుగుతుండగా అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యి ఏకంగా బాలీవుడ్ కి వెళ్లి పోయి అక్కడ సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారని మరో ప్రచారం జరుగుతోంది.

సందీప్ ఫైనల్ అయినట్టేనా?
వీరిద్దరూ కాదు సిద్ధార్థ్ మల్హోత్రా అనే ఒక బాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాకు దర్శకుడు వ్యవహరిస్తున్నారని మరో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే దాని మీద రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసిన ఆయన ప్రస్తుతం యానిమల్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.