మా బరిలో ప్రకాష్ రాజ్... పోటీగా దిగుతున్న మంచు విష్ణు.. ఆయన మద్దతు ఎవరికి?

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతి ఏడాది వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. చివరిగా జరిగిన మా ఎన్నికలలో అయితే ఒక పక్క నరేష్ మరో పక్క శివాజీరాజా ఒకరి మీద ఒకరు పోటీ చేయడంతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాక మీడియా ముందుకు కూడా వచ్చి పెను విధ్వంసమే సృష్టించారు. అలాంటి మా ఎన్నికలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మా బరిలో ప్రకాష్ రాజ్

మా బరిలో ప్రకాష్ రాజ్

ఈ ఏడాది జరగబోతున్న మా అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు ప్రకటించారు. ఈమధ్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా తాను త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దిగి పోతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

చిరు బ్లెస్సింగ్స్ తో

చిరు బ్లెస్సింగ్స్ తో

అయితే ఆయనకు పోటీగా బరిలోకి ఎవరు దిగుతున్నారు అనే విషయం పక్కన పెడితే తాను చిరంజీవి బ్లెస్సింగ్స్ తోనే బరిలోకి దిగుతున్నానని ఆయన కామెంట్స్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నటుడు కరోనా కాలంలో పేదనటులకు సాయపడినట్టు చెబుతున్నారు. అది కూడా ఆయనకు కలిసొచ్చేలా కనిపిస్తోంది.

విష్ణు కూడా బరిలో

విష్ణు కూడా బరిలో

మరో పక్క మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా ఈసారి మా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే మోహన్ బాబు చిరంజీవి సన్నిహితులు కావడం తో ఒకవేళ మంచు విష్ణు రంగంలోకి దిగితే చిరంజీవి మద్దతు ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నోరు విప్పని మంచు విష్ణు

నోరు విప్పని మంచు విష్ణు

అయితే ఈ విషయం మీద మంచు విష్ణు ఎలాంటి కామెంట్ చేయకపోయినా సరే ఈ ఉదయం ఆయన తన తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వెళ్లారు అని తెలుస్తోంది. నిజానికి చిరంజీవి మోహన్ బాబు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది.

Recommended Video

The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
ఇద్దరూ బరిలోకి దిగితే

ఇద్దరూ బరిలోకి దిగితే

ఇటీవల రిలీజ్ అయిన సన్ ఆఫ్ ఇండియా టీజర్ కూడా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన గొంతు అందించారు. అలాగే ప్రస్తుత అధ్యక్షుడుగా ఉన్న వీకే నరేష్ కూడా విష్ణు అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. మా అసోసియేషన్ లో మొత్తం తొమ్మిది వందల ఓట్లు ఉండగా ఈసారి వీరిద్దరూ పోటీలో దిగితే పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X