మొదటి సారి అలా కనిపించిన ప్రియదర్శి.. లస్ట్ కోసం రక్తం చిందిస్తారా అంటూ?
పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి పులికొండ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. కెరీర్ మొదట్లోనే మల్లేశం అనే సినిమా ద్వారా హీరోగా అవకాశం దక్కింది. అయినా ఎలాంటి పాత్రలు వచ్చినా వాటిని తనదైన శైలిలో నటిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఎక్కువగా ఆయన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన తాజాగా ఓ క్రైమ్ థిల్లర్ కథాంశంతో మన ముందుకు రాబోతున్నారు. నందినిరాయ్ లీడ్ రోల్ పోషించిన "ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్" వెబ్ సిరీస్‌లో ఆయన నటిస్తున్నారు.
100 పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ కాబోతున్న ఈ సిరీస్ కి సంబంధించి ప్రియదర్శి ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రియదర్మి సిగరెట్ వెలిగిస్తూ సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చాడు, ఒక చైర్ లో కూర్చుని ఉన్నారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను సురేశ్ కృష్ణ సంస్థ నిర్మించింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి నందిని రాయ్ తో కలిసి నటించాడు.

పోసాని కృష్ణమురళి నందిని రాయ్ భార్యాభర్తలుగా నటిస్తుండగా నందిని రాయ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ కధలో భర్త పోసాని కృష్ణ మురళి నందిని చంపేస్తుంది అని తెలుస్తోంది. అయితే ఆ మర్డర్ కేసు తన మీద పడకుండా బాడీని మాయం చేయడం కోసం ప్రియదర్శి హెల్ప్ అడుగుతుందని చెబుతున్నారు. బహుశా అందుకేనేమో ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా ఆ మేరకు హింట్ ఇచ్చారు. లస్ట్ కోసం రక్తం చిందిస్తారా ? అని అడిగి, ఆది(పాత్ర పేరు)ని కలవండి అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే రేపు టీజర్ రిలీజ్ అవుతుందని పేర్కొన్నాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











