twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియదర్శి “మెయిల్”కి అరుదైన ఘనత..'ఆహా' అనిపిస్తూ ఆ ఫిలిం ఫెస్టివల్‌కి ఎంపిక!

    |

    కమెడియన్ ప్రియదర్శి నటించిన మెయిల్ అనే వెబ్ సిరీస్ తరహా ఎపిసోడ్ కొద్ది రోజుల క్రితం ఆహాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కంబాలపల్లి కథలు అనే ఒక నాలుగు ఎపిసోడ్స్ లో మొదటి ఎపిసోడ్ గా రిలీజ్ అయిన మెయిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. స్వప్న సినిమా బ్యానర్ రూపొందిన ఈ ఎపిసోడ్ అంతా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా కంప్యూటర్ వచ్చిన 2005 సంవత్సరం మొదట్లో సాగిన కథను ఎంచుకున్న దర్శకుడు దాని ద్వారా కామెడీ పండించి, అందరినీ ఎంగేజ్ చేయగలిగాడు. అప్పుడప్పుడే ఊర్లలో కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజులు అంటూ మొదలయ్యే ఈ ఎపిసోడ్ జనవరి 12న 'ఆహా'లో విడుదలైంది.

    ఇందులో ప్రియదర్శి తోపాటు హర్షిత్ మల్గిరెడ్డి, గౌరీ ప్రియ కీలక పాత్రల్లో నటించగా.. ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించాడు. ఇక విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఎపిసోడ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఈ 'మెయిల్' ఎపిసోడ్ జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకి ఎంపికయ్యిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ 'స్వప్న సినిమా' సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

    Priyadarsi Mail selected for New York India Film Festival

    ప్రియాంక దత్ నిర్మాతగా ఈ సినిమాకు వ్యవహరించిన ఈ ఎపిసోడ్ కి ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించాడు. హైబత్ అనే పాత్రలో నటించిన ప్రియదర్శి ఊర్లో చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి గేమింగ్ సెంటర్ ఒక ఏర్పాటు చేసి బిజినెస్ మొదలు పెడతాడు. అదే ఊరిలో ఒక కాలేజీ కుర్రాడు(హర్షిత్) కంప్యుటర్ నేర్చుకోవాలని ఆశపడతాడు. అయితే ఆ కుర్రాడు హైబత్ దగ్గర కంప్యూటర్ అసలు నేర్చుకున్నాడా? నేర్చుకునే ప్రాసెస్ లో ఏం జరిగింది? అనే చిన్న లైన్ ను ఆధారంగా చేసుకుని రాసుకున్నదే ఈ ఎపిసోడ్ కధ. మొత్తం మీద ఈ ఎపిసోడ్ న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రదర్శనకు ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది.

    English summary
    Mail – the first part of Kambalapally Kathalu was premiered on Regional Telugu Exclusive OTT Platform, Aha Video. It has got a good response as it stirred the nostalgia of the 90s kids. Now, the movie is officially selected for the screening at New York Indian Film Festival starting from June 4th. The makers, Swapna Cinemas, and the OTT platform have informed about it in their Twitter account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X