Don't Miss!
- News
వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్
- Sports
టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Finance
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
- Lifestyle
ఈ లక్షణాలు ఉంటే మీ మెదడు వయసు మీకంటే పెద్దదని అర్థం...!
- Technology
రాబోయే Vivo ఫోల్డబుల్ మొబైల్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
SSMB28: మహేశ్ మూవీలో మరో క్యూట్ బ్యూటీ.. ఒక్క హిట్ లేకున్నా బంపర్ ఆఫర్
ఈ మధ్య కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని.. కెరీర్‌లోనే ఎన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ విజయాలు ఇచ్చిన జోష్‌తో ఉన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే మూవీని చేశాడు మహేశ్. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. మూడు వారాలు పూర్తైనా ఈ సినిమా బాక్సాఫీస్‌పై ప్రభవాన్ని చూపిస్తూనే ఉంది.
పొట్టి బట్టల్లో యమ హాట్‌గా అనసూయ: పబ్లిక్ ప్లేస్లోనే భర్తతో క్రేజీగా లిప్‌లాక్
'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభం అవడానికి చాలా సమయం ఉండడంతో దీని కంటే ముందు మరో సినిమాను చేయాలని అతడు ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను అనౌన్స్ చేసేశాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో అప్పుడే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఎన్నో ఆసక్తికరమై అంశాలు వైరల్ అవుతున్నాయి.

'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, ఈ మూవీ షూట్ జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
బ్రాతో ఇలియానా హాట్ సెల్ఫీ: ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజు
త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోయే సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. ఇక, ఇప్పుడు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేస్తున్నారట. త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం సర్వసాధారణమే. ఇందులో భాగంగానే మహేశ్ బాబుతో చేసే సినిమాలో పూజా హెగ్డేతో పాటు ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారని తాజాగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. తెలుగులో ఈ భామ 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం' వంటి సినిమాలు చేసింది. కానీ, ఈవేమీ విజయం సాధించలేదు. అయినప్పటికీ మహేశ్ మూవీలో ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ వ్యవహరిస్తున్నారు.