‘భారీగా నష్టపోతే చిరంజీవి ఆదుకొన్నాడు.. ఏజెంట్ ఫ్లాప్ అయితే అఖిల్..
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా, ఇండస్ట్రీలోని సమస్యలను కూడా తనకు వీలైనంత పరిష్కరించే పెద్దన్న పాత్రను కూడా బాధ్యతాయుతంగా పోషిస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు పలు సందర్భాల్లో చిన్న ఆర్టిస్టుల వైద్య ఖర్చులకు సాయం అందిస్తూ వస్తున్నారు. ఇలా మానవత్వం చాటుకుంటున్న చిరంజీవి తన ప్రొడ్యూసర్ల విషయంలోనూ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. ఇప్పటికీ సాయం అందిస్తూనే ఉన్నారు.
కాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల విషయంలో చిరంజీవి తన నిర్మాతలకు ఎంత సాయం చేస్తారో అనిల్ సుంకర చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన నిర్మాతగా భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ చిత్రంలో విడుదలైంది. రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో నిర్మాతకు ఈ చిత్రంతో స్వల్పంగా నష్టం జరిగింది.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాకు తన రెమ్యునరేషన్ ను ఏమాత్రమూ తీసుకోలేదని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. అంతే కాదు భోళాశంకర్ చిత్రం నష్టాల నుంచి బయట పడే వరకు చిరంజీవి తనకు సహకారంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ఏజెంట్ చిత్రానికి ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంట. సినిమాపై వచ్చిన కామెంట్స్ ను కూడా ఆయన పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి విషయంలో నాకు టాలీవుడ్ స్టార్స్ సహకరిస్తూనే వస్తున్నారని చెప్పుకొచ్చాడు.
ఇక చిరంజీవి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. దాని వల్లనే మళ్లీ సినిమాలు చేయగలుగుతున్నామని అన్నారు. ఇక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో చివరిగా మజాకా అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, అఖిల్ ఏజెంట్ చిత్రాలు వరుసగా వచ్చి డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ బ్యానర్ నుంచి పెద్ద స్టార్స్ తో సినిమాలు రావడానికి కాస్తా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఈ బ్యానర్ లో చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ ను మన శంకరవరప్రసాద్ గారు గా ప్రకటించారు. పండక్కి వస్తున్నారనేది ఉపశీర్షికగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వశిష్ట దర్శకత్వంలోని విశ్వంభర, ఆ నెక్ట్స్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











