twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam మరో చరిత్ర, గీతాంజలి స్థాయి లవ్ స్టోరి.. సెన్సేషనల్ హిట్ కావడం గ్యారెంటి.. నిర్మాత అశ్వినీదత్ ధీమా!

    |

    ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథ ఉపశీర్షిక. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ..

    కెరీర్‌లో 60వ సినిమా

    కెరీర్‌లో 60వ సినిమా


    సీతారామం నా కెరీర్‌లో 60వ సినిమా. నా జీవితంలో ఎంతో మందితో సినిమాలు తీశా. ఎన్నో గొప్ప కథలతో సినిమాలను నిర్మించాను. కానీ నేను ఎప్పుడూ లవ్ స్టోరీలు తీయలేదు. మంచి లవ్ స్టోరి తీయడానికి సహకరించిన హను రాఘవపూడి, రష్మిక మందన్న, మృణాల్ థాకూర్, దుల్కర్ సల్మాన్‌కు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను.

    నా కోరిక నెరవేరింది..

    నా కోరిక నెరవేరింది..

    నాకు ఎప్పుడూ మంచి లవ్ స్టోరీలు తీయలేదనే ఫీలింగ్ ఉండేది. బాలచందర్ తీసిన మరో చరిత్ర, మణిరత్నం తీసిన గీతాంజలి నాకు బాగా నచ్చిన లవ్ స్టోరీ మూవీస్. ఈ రెండు సినిమాలు చూసేటప్పుడు ఇలాంటి సినిమాలు నేను ఎప్పుడైనా తీయగలనా అని అని ప్రశ్నించుకొనే వాడిని. ఆ కోరిక సీతారామం సినిమాతో నెరవేరింది అని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు.

    రష్మిక, మృణాల్, దుల్కర్‌కు థ్యాంక్స్

    రష్మిక, మృణాల్, దుల్కర్‌కు థ్యాంక్స్


    సీతారామం సినిమా షూటింగు దాదాపు 200 మందితో చేశాం. ఆ సమయంలో ఎక్కడ షూట్ చేసిన కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కశ్మీర్ నుంచి వచ్చేటప్పుడు డైరెక్టర్ హనుకు కరోనా పాజిటివ్ వచ్చింది. రష్యాకు బయలుదేరి వెళ్లేటప్పుడు కూడా కరోనా వచ్చింది. అలాంటి పరిస్థితులను ఎదురించి సీతారామం సినిమా షూట్ కంప్లీట్ చేశారు. అందుకు రష్మిక, దుల్కర్, మృణాల్ థాకూర్‌కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రష్మిక, సుమంత్‌తో నాకు రెండో సినిమా అని అశ్వినీదత్ అన్నారు.

    సీతారామం సెన్సేషనల్ హిట్

    సీతారామం సెన్సేషనల్ హిట్

    టాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదు. అయితే సీతారామం సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ సినిమా సూపర్ సెన్సేషనల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా సక్సెస్ విషయంలో రెండో ఆలోచన లేదు. ఈ సినిమా తీసినందుకు చాలా గర్వపడుతున్నాను అని అశ్వినీదత్ అన్నారు.

    థియేటర్లలోనే కొత్త అనుభూతి

    థియేటర్లలోనే కొత్త అనుభూతి


    సీతారామం సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఆనందపడుతారు. మీలో ఒక్కరిని నేను పలకరిస్తాను. ఈ సినిమా టికెట్ రేట్లు చాలా నార్మల్‌గా ఉంటాయి. అందరికి అందుబాటులోనే ఉంటాయి. ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే చూడాలని కోరుకొంటున్నాను. చూస్తారనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే.. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ గానీ, లొకేషన్లు గానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం గానీ ఖచ్చితంగా థియేటర్లు చూడాలి. సీతారామం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి.

    English summary
    Sita Ramam Trailer has good response in social media. Producer Ashwini dutt more confidence on success at Sita Ramam Trailer launch event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X