For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas Spirit కథ లీక్ చేసిన నిర్మాత.. అదిరిపోయేలా ప్రభాస్ క్యారెక్టర్!

  |

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు.

  మరోవైపు ప్రభాస్ కూడా వరుసపెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రానున్న సినిమాతో సహా 6 ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అందులో స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను నిర్మాతలు లీక్ చేశారు.

  బాహుబలి సినిమాతో..

  బాహుబలి సినిమాతో..

  స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనదైన క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈశ్వర్ మూవీతో హీరోగా స్టార్ట్ చేసిన ప్రభాస్ సుధీర్ఘ కాలంగా తెలుగులో సత్తా చాటుతున్నాడు. అప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ గా క్రేజ్ ఉన్న ప్రభాస్.. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.

  సక్సెస్ కానీ సాహో, రాధేశ్యామ్..

  సక్సెస్ కానీ సాహో, రాధేశ్యామ్..

  బాహబలి రెండు పార్ట్స్ సినిమాల బ్లాక్ బస్టర్ హిట్ తర్వాతి నుంచి అన్ని సినిమాలను భారీగానే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్. ఈ క్రమంలోనే సుజిత్ దర్శకత్వంలో సాహో, రాధా క్రిష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధేశ్యామ్ సినిమాల్లో నటించాడు ప్రభాస్. అయితే అవి ఊహించినంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. వచ్చిన అవి అంతగా సక్సెస్ కాలేదు.

  విపరీతమైన ట్రోలింగ్..

  విపరీతమైన ట్రోలింగ్..

  బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో తర్వాతి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ప్రభాస్. అయితే ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకులనే కాకుండా అభిమానులను సైతం నిరాశపరిచింది. దీంతో ఆ టీజర్ పై, దర్శకుడిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇక ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిరుపు ఎలా ఉన్నా.. తర్వాతి సినిమాలు అయినా బాగుండాలని కోరుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

   మరో బాలీవుడ్ దర్శకుడితో..

  మరో బాలీవుడ్ దర్శకుడితో..

  ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ తో పాటు మరో ఐదు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్' ఉన్నాయి. ఇక ఇటీవలే మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యెర్నేని నవీన్ తెలిపారు.

  ఎన్నడూ చూడని విధంగా..

  ఎన్నడూ చూడని విధంగా..

  అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లనున్న స్పిరిట్ సినిమా నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "స్పిరిట్ చాలా ప్రత్యేకమైన చిత్రం. కాప్ డ్రామాగా తెరకెక్కనుంది.

  అయితే ఈ కథను సందీప్ రెడ్డి డిఫరెంట్ స్టైల్ లో ప్రజెంట్ చేయనున్నాడు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. సినిమాలో మ్యూజిక్ ట్రెమండస్ గా ఉండనుంది. యానిమల్ సినిమా తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకే ఈ సినిమా గురించి అప్పుడే పూర్తి విషయాలు చెప్పలేను. కానీ ఇంతవరకు ముందెన్నడు చూడని సినిమా అవుతుందని మాత్రం గ్యారెంటి ఇవ్వగలను" అని ఆయన తెలిపారు.

  English summary
  T Series Founder Bhushan Kumar Reveals Prabhas Sandeep Reddy Vanga Movie Spirit Story And Says Prabhas Is A Cop.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X