15 ఏళ్ల సమయం ఉంది.. ఇంకా ఆ టైమ్ రాలేదు.. ట్రోలింగ్‌పై నాగవంశీ ఘాటుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకొంటున్న నేపథ్యంలో చాలా రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న నిర్మాత నాగవంశీ సూర్యదేవర ఎట్టకేలకు స్పందించారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాను ఆయన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రేటు చెల్లించి డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు చేరుకోకపోవడంతో డిజాస్టర్ దిశగా ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దాడి జరిగింది. వాటికి నాగవంశీ సమాధానం ఎలా ఇచ్చారంటే?

జూనియర్ ఎన్టీఆర్‌ను అమితంగా అభిమానించే నాగవంశీ వార్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తన ఫేవరేట్ హీరో తొలిసారి హిందీలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం, ఆ సినిమా ఫ్రాంచైజీకి క్రేజ్ ఉండటంతో నాగవంశీ ఫ్యాన్సీ రేటు అంటే.. సుమారుగా 90 కోట్ల రూపాయలు చెల్లించి థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకొన్నారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సుమారుగా 50 కోట్లకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

Producer Naga Vamshi

అయితే వార్ 2 సినిమా రిలీజ్ తర్వాత నాగవంశీపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. వార్ 2 సినిమాతో దివాళా తీశాడు.ఇల్లు అమ్ముకొని దుబాయ్‌కి వెళ్లాడు. ఇక మీడియాకు, సోషల్ మీడియాకు ఏడాదిపాటు దూరంగా ఉంటాడు. తన సినిమాను విడుదల చేయకుండా వాయిదా వేశాడు. వార్ 2 ఫలితం ఆయనను డిఫెన్స్‌లో పడేసింది అంటూ కామెంట్స్ వేశారు. అయితే తనపై వస్తున్న కామెంట్స్‌కు ఆయన ఘాటుగా సోషల్ మీడియాలో స్పందించారు.

నాగవంశీ ట్విట్టర్‌‌లో స్పందిస్తూ.. ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ నేరేషన్‌తో ఫుల్లుగా హడావిి నడుస్తున్నది. పర్లేదు. ట్విట్టర్‌‌లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజాపాయింట్ చేస్తున్నందుకు మీ అందరికి సారీ. ఇంకా టైమ్ రాలేదు. మినిమమ్ ఇంకో 10 నుంచి 15 ఏళ్లు టైమ్ ఉంది అని నాగవంశీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎప్పటికీ నా జీవితం సినిమా కోసమే.. సినిమా గురించే ఉంటుంది. నా తదుపరి చిత్రం మాస్ జాతరతో మీ అందరిని త్వరలోనే కలుసుకొంటాను అని నాగవంశీ ట్రోలర్స్‌కు షాకిచ్చాడు. తనపై ధారాళంగా వస్తున్న ట్రోల్స్‌కు సరైన సమాధానమే ఇచ్చారనే మాట ఆయన అభిమానుల నుంచి వినిపిస్తున్నది. కొందరు వెల్కమ్ బ్యాక్ వంశీ అంటూ ఆయనకు సపోర్టుగా నిలిస్తే.. మరికొందరు ఎప్పటిలానే ట్రోల్స్ వేస్తూ కామెంట్స్ ఫుల్లుగా నింపారు.

ఇదిలా ఉండగా, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన మాస్ జాతర చిత్రం అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఆగస్టు 27వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వార్ 2 డిస్ట్రబెన్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అధికారికంగా డేట్ ప్రకటించే అవకాశం త్వరలోనే ఉందని చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: naga vamshi jr ntr war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X