For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gali Vaana నా వాళ్లను చంపిన వాడు బ్రతకకూడదు.. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రెచ్చిపోయిన రాధిక

  |

  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లూజర్, లూజర్ 2 లాంటి టాప్ నాచ్ సిరీస్ తర్వాత బీబీసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బీబీసి స్టూడియోస్‌ నిర్మించిన యూరోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ZEE5 వారు 'గాలివాన' అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది.

  ZEE5 ఓటిటి లో ఏప్రిల్ 14 న స్ట్రీమింగ్ కానున్న "గాలివాన' వెబ్ సిరీస్ లో రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ ప్రోమోను సీనియర్ నటి కుష్బూ గారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. రాధికా శరత్ కుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రోమో ను చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
  జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి.కానీ నిజమైన కస్టం ఏమిటో.. తెలుసా శ్రావణి ? ఏ.. కొడుకునైతే నవమాసాలు మోసి కన్నానో..వాడికి కర్మ కాండలు జరిపించడం. నా కోడుకు, కోడలును చంపిన వాడు బ్రతకకూడదు. అని చెప్పే డైలాగ్ లు "గాలివాన" లో ఫ్యామిలీ, రివెంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు ప్రేక్షకులకు అర్థమవుతుంది.

   Radhika Sarathkumar rampage with powerful dailogues in Gaalivaana web series

  రాధిక గారు చెప్పిన ఎమోషన్ డైలాగ్స్ యూట్యూబ్ లో సంచలనం సృస్టిస్తూ.. మంచి వ్యూస్ తెచ్చుకొంటుంది.గతంలో కూడా ఎన్నో ఫ్యామిలీ రివెంజ్ డ్రామా కథలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని విజయం సాధించాయి. ఆ కోవలో ఈ గాలివాన కూడా సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ ను వీక్షకులకోసం ఏప్రిల్ 14 న Zee5 ఓటిటి లో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

  ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్, నందిని రాయ్, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  నటీనటులు: సాయికుమార్‌, రాధిక శరత్‌కుమార్‌, నందిని రాయ్‌, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, అర్మాన్‌, శరణ్య ప్రదీప్‌, ఆర్‌. రమేష్‌, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్‌, సతీష్‌ సారిపల్లి, నానాజీ, నవీన్‌, సూర్య శ్రీనివాస్‌, జయచంద్ర తదితరులు
  దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి,
  డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: సుజాత సిద్దార్థ
  ప్రొడ్యూసర్‌: శరత్‌ మరార్‌
  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నీలిమా మరార్‌
  ప్రాజెక్ట్‌ హెడ్‌: కీర్తి మన్నె
  క్రియేటివ్‌ హెడ్‌: ఎ. సాయి సంతోష్‌
  కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రేఖా బొగ్గరపు
  ఆర్ట్‌ డైరెక్టర్‌: ప్రణయ్‌ నయని.
  ఎడిటర్‌: సంతోష్‌ నాయుడు
  సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల
  ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వైశాక్‌ నాయర్‌
  ప్రొడక్షన్‌ మేనేజర్‌: రవి మూల్పూరి
  ప్రొడక్షన్‌ మేనేజర్‌ అసిస్టెంట్‌: రామ్‌ ప్రసాద్‌
  కోడైరెక్టర్‌: కే ప్రభాకర్‌
  చీఫ్‌ ఏడీ: హనుమంత్‌ శ్రీనివాసరావు.

  English summary
  ZEE5 has been in a top-notch form. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures and 'Loser 2' from Annapurna Studios stable, the streaming giant is now bringing out 'Gaalivaana', which is jointly produced by BBC Studios and NorthStar Entertainment. The drama is an adaptation of a European drama written to suit the sensibilities of the Telugu audience. The ZEE5 original will stream from April 14.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X