రాఘవ లారెన్స్ "కాంచన- 3" డేట్ ఫిక్స్, డాల్బీ ఎట్మాస్ సౌండ్‌తో మోషన్ పోస్టర్!
ముని, కాంచన, కాంచన 2 లాంటి హర్రర్ కామెడి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ త్వరలో కాంచన-3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ, తెలుగు బాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చుసుకుంది. ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ తెలుగులో డాల్బి ఎట్మాస్ సౌండ్‌తో విడుదల చేశారు. లారెన్స్ డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్‍పి బ్యానర్ పై బి.మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాఘవ నిర్మించారు.

ఈ సందర్భంగా సమర్పకుడు బి మధు మాట్లాడుతూ... రాఘవ లారెన్స్ తీసిన హర్రర్ కామెడీ సినిమాన్నీ సూపర్ హిట్లే. అందులో 'ముని' సీక్వెల్స్ చాలా స్పెషల్. తెలుగులో 'కాంచన' పేరుతో మొదలైన ఈ సిరీస్ తాజా సక్వెల్ కాంచన 3 గా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 18న వస్తుంది. ఈ సిరీస్‌లో వస్తున్న 4వ సినిమా ఇది. వచ్చే వేసవిలో ప్రేక్షకులు మంచి వినోదం పంచుతుందని తెలిపారు.
రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కొవైసరళ, కభీర్ దుహన్ సింగ్, శ్రీమన్, దేవదర్శిని, సత్యరాజ్, కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి- వెట్రి, సర్వెష్ మురారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











