For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోలకి కొత్త పనులు అప్పచెప్పిన జక్కన్న.. రేపటి నుంచి ఆ ఎన్టీఆర్ కి ఆ బాధ్యతలు, భలే స్ట్రాటజీ!

  |

  తెలుగు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ అనే చెప్పాలి. బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రాజమౌళి చాలా ప్లాన్ చేసి మరీ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ తేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు. వీరి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సముద్రఖని అజయ్ దేవగన్ వంటి అనేక సార్లు కూడా ఈ సినిమాలో భాగం అవుతుండడంతో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇక హీరోలకి జక్కన్న కొత్త కొత్త పనులు అప్ప చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  జక్కన్న రెడీ

  జక్కన్న రెడీ

  సినిమా తీయడంలో చాలా నేర్పరి అయిన రాజమౌళి ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా అంతే నేర్పరి అని చెప్పక తప్పదు.. రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీస్ కారణంగానే బాహుబలి సినిమా అన్ని వందల కోట్లు సంపాదించిందని ట్రేడ్ వర్గాల వారు ఇప్పటికీ విశ్లేషిస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఇప్పటికే రాజమౌళి ప్రారంభించాడని అంటున్నారు.. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉన్న కరోనా మహమ్మారి కారణంగా విడుదల చేయలేక పోయారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన దసరా సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి ఆ రోజుకి సినిమాను విడుదల చేయడని చాలా మంది భావిస్తున్నా చిత్రయూనిట్ మాత్రం కచ్చితంగా అదే రోజు సినిమా వస్తుంది అని ఢంకా బజాయించి మరీ చెబుతోంది.

   సినిమా కొంటున్నప్పుడే

  సినిమా కొంటున్నప్పుడే

  అయితే మరి ఈ సినిమా విషయంలో ఇప్పటికే మొత్తం హక్కులను కూడా బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కు అమ్మేశారు.. అయితే ఆ సంస్థ హక్కులు కొనుక్కుంటున్నఅప్పుడే ప్రమోషన్స్ విషయం మాత్రం రాజమౌళి భుజాల మీద బాధ్యతలు పెట్టారని తెలుస్తోంది.. ఇక రాజమౌళి కూడా బాధ్యతలు భుజానికెత్తుకుని ఎప్పటికప్పుడు సినిమాను వార్తలలో అలాగే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యేలాగా చూస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఉక్రెయిన్ దేశంలో జరుగుతుంది. అక్కడికి బయలుదేరినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఫోటో విడుదల చేస్తూ లేదా ఏదో ఒక షూటింగ్ అప్డేట్ ఇస్తూ వార్తల్లో నిలిచేలా గా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. నిన్నటికి నిన్న రామ్ చరణ్ తేజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ఎన్టీఆర్ తో కలిసి సరదాగా గడుపుతున్న ఒక వీడియోను షేర్ చేశారు..

   అధికారిక ప్రకటన

  అధికారిక ప్రకటన

  ఆ వీడియోలో ఎన్టీఆర్ కంటిపైన గాయం లాగా కనిపిస్తూ ఉండటంతో అది పెద్ద చర్చకు దారి తీసింది ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆయన కంటికి గాయమైందని భావిస్తూ పెద్ద ఎత్తున నిర్మాణ సంస్థను టార్గెట్ చేశారు. నిర్మాణ సంస్థ అది కేవలం ఒక స్టిక్కర్ అని షూటింగ్ లో అతికించారు అని తీసేస్తే పోతుంది అని చెప్పుకొచ్చింది.. ఇలా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచేలా గా ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఇప్పుడు హీరోలు ఇద్దరికీ కూడా కొత్త బాధ్యతలు అప్పగించాడని అంటున్నారు. ఆ విషయాన్ని కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ప్రకటించింది.. అదేంటంటే రేపటి నుంచి కొద్ది రోజుల వరకు మా సినిమా యూనిట్ కి సంబంధించిన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఎన్టీఆర్ చేతికి అప్పగిస్తామని మరికొద్ది రోజుల పాటు మా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు ఆయనే అందిస్తారు అంటూ ఒక ప్రకటన చేసింది.

  స్ట్రాటజీనేనా

  స్ట్రాటజీనేనా

  సాధారణంగా హీరోలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వాడుకుంటారో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే చిన్న హీరోలు మొదలు పెద్ద వాళ్ల వరకూ డిజిటల్ టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. అలాగే పి ఆర్ టీమ్స్ కూడా ఉంటాయి.. కానీ మొట్ట మొదటిసారి మా సినిమా అధికారిక ఖాతాను ఎన్టీఆర్ నిర్వహిస్తారు అంటూ ప్రకటించడం అనేది రాజమౌళి స్ట్రాటజీ లోని ఒక భాగం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని గురించి చర్చ జరుగుతుందని తద్వారా సినిమా మరింత ప్రజల్లోకి వెళుతుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  అదే అసలు ప్లాన్

  అదే అసలు ప్లాన్

  అయితే ఇప్పటికే సినిమా ప్రజల్లోకి బాగానే చొచ్చుకు పోయింది కానీ ప్రతి ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడమే లక్ష్యంగా రాజమౌళి ప్రమోషన్ యాక్టివిటీస్ ని టార్గెట్ చేశారు అని అంటున్నారు.. ఒక రకంగా రాజమౌళి చెప్పిన డేట్ కి సినిమా విడుదల చేస్తే కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కానుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కొన్ని పేరున్న సినిమాలు విడుదలయ్యాయి కానీ అనుకున్నంత మేర అంచనాలను మాత్రం అందుకోలేక పోయాయి. ఈ సినిమా కనుక విడుదలై ప్రతి ప్రేక్షకుడిని కూడా కరోనా భయం లేకుండా థియేటర్ కి రప్పించగలిగితే రాజమౌళి వేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీ లో అన్నీ వర్కవుట్ అయినట్టే. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Rajamouli, who is very good at filmmaking, is equally adept at promoting the film. It is said that Rajamouli has already started promotional activities for the film RRR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X