twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR రన్ టైమ్ కోసం రాజమౌళి రిస్క్.. ఆడియెన్స్ అంతసేపు చూడగలరా?

    |

    ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు ఒకే ఒక్క RRR సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి దెబ్బకు తెలుగు సినిమాలకు ఆభిమానులు పెరిగారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ ప్రభావం RRR సినిమాపై అంతకంటే ఎక్కువ పెరిగేలా ఉందని చెప్పవచ్చు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఎంతగానో కష్టపడుతున్నాడు.

    RRR క్రేజ్..

    RRR క్రేజ్..

    దర్శకధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి అడుగులు వేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెయిన్ గా ఫస్ట్ లుక్ టీజర్స్ రిలీజ్ చేయడంలోనే ఆడియెన్స్ ఒక్కసారిగా సినిమా వైపు దృష్టి పెడుతుంటారు. రీసెంట్ గా రిలీజైన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ టీజర్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విడుదలైన అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యింది.

    ఎన్టీఆర్ కోసం వెయిటింగ్..

    ఎన్టీఆర్ కోసం వెయిటింగ్..

    అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతమైన ఫిజిక్ తో కనిపించాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. అదే విధంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా తారక్ లుక్కు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మే 20వ తేదీన తారక్ బర్త్ డే సందర్భంగా తప్పకుండా ఒక టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆ డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు అందరూ వెయిట్ చేస్తున్నారు.

    రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా..?

    రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా..?

    ప్రస్తుతం సినిమా రన్ టైమ్ కి సంబంధించిన ఒక రూమర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా నిడివి ఎంత సేపు అనే విషయంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఓ విధంగా రాజమౌళి ఆ విషయంలో రిస్క్ చేస్తున్నాడని కూడా టాక్ వస్తోంది. ఎందుకంటే RRR సినిమా నిడివి 3గంటలు దాటే అవకాశం ఉందట. సాధారణంగా ఈ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా రెండున్నర గంటలకు మించి కట్ చేయడం లేదు.

    RRR కోసం ఉంటారేమో..

    RRR కోసం ఉంటారేమో..

    సినిమా నిడివి ఏ మాత్రం ఎక్కువైనా బోరింగ్ గా ఫీలవుతున్నారు. కానీ ఈ సినిమా అన్ని సినిమాల్లా కాదు కాబట్టి తారక్ చరణ్ కోసం ఫ్యాన్స్ ఎంతసేపైనా ఉండవచ్చు. ఇక రాజమౌళి మూడు గంటల సమయం తీసుకుంటున్నాడు అంటే తప్పకుండా ఏదో ఒక మంచి ఆలోచనే ఉండి ఉంటుంది. దర్శకధీరుడు ఇంతవరకు ముడుగంటల సినిమాను తెరకెక్కించలేదు. బాహుబలి సెకండ్ పార్ట్ కోసమే కష్టపడి రెండు గంటల 50 నిమిషాలకు కుదించాడు. ఇక RRR విషయంలో ఆ లెక్క దాటేలా ఉంది. మరి జక్కన్న ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

    English summary
    Big budget movie RRR’s runtime has become the latest hot topic in tollywood. the film’s final duration will stretch close to 3 hours, making it one of the longest movies in director Rajamouli’s career. His previous Baahubali second part, had a run time of about 2 hour 50 minutes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X