హైకోర్టు మెట్లెక్కిన కూలీ.. సెన్సార్ బోర్డు పై వార్.. ఎందుకంటే?
ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలీ. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కగనరాజ్ దర్శకత్వం వహించడం విశేషం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. హైప్ తో ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక సినిమాకు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే వసూళ్లు అందుతుండటం ఆసక్తికరంగా మారింది. కూలీ చిత్రానికి కూడా ఓపెనింగ్ డే మిక్డ్స్ టాక్ దక్కడంతో సినిమాపై కాస్తా నెగెటివ్ టాక్ వ్యాప్తి చెందింది. దీంతో సినిమా నిర్మాతలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా కూలి చిత్రం నిర్మాత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాపై నెగెటివ్ టాక్ రావడానికి ఒకింత కారణం సెన్సార్ బోర్డు అని భావించారని తెలుస్తోంది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (CBFC) తమ సినిమా కూలీకి A సర్టిఫికెట్ ఇచ్చినందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. రజనీకాంత్ 50వ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇలాంటి సర్టిఫికేషన్ ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టులో వెల్లడించారు. సినిమాకు U/A రివ్యూలు దక్కాయి. అందరూ సినిమాలో A సర్టిఫికేట్ స్థాయిలో సన్నివేశాలు ఏమీ లేవని సన్ పిక్చర్స్ సంస్థ అభిప్రాయ పడింది.

కేజీఎఫ్, బీస్ట్ వంటి చిత్రాలకే U/A సర్టిఫికెట్స్ అందించాయని, కూలీ విషయంలో సెన్సార్ బోర్డు నిర్ణయం సరికాదని అంటున్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎ. కుమారగురు ఈ పిటిషన్ కొనసాగించేది కాదని తెలిపారు. కానీ సీనియర్ లాయర్ జె. రవీంద్రన్, ఎం.స్నేహలు మాత్రం సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021 ప్రకారం హైకోర్టు ఇలాంటి అప్పీళ్లను విచారించే అధికార పరిధిని కలిగి ఉందని కోర్టుకు వివరించారు. ఇకదీనిపై మున్ముందు ఎలాంటి నిర్ణయం వస్తుందనేది చూడాలి.
రజనీకాంత్ లాంటి ఉన్నతమైన నటుడి సినిమాకు ఇలాంటి సర్టిఫికేషన్ ఇవ్వడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఇక పిల్లలు, టీనేజర్స్ ను ఈ చిత్రానికి దూరంగా ఉంచడటం సినిమా స్థాయిని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. అయితే రజనీకాంత్ అభిమానులు తమ పిల్లలతో థియేటర్లోకి వస్తే తమిళనాడులో చాలా థియేటర్లలో పిల్లలను హాల్‌లోకి అనుమతించడానికి సినిమా హాల్ యజమానులు గొడవ పడ్డారు. దాంతో కూలికి A సర్టిఫికేట్ ఇవ్వడంపై నిర్మాత కళానిధి మారన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ చిత్రాన్ని రూ.370 కోట్లతో సినిమాను నిర్మించారు. రజనీకాంత్ తోపాటు అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో అలరించారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్ తో అదరగొట్టారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో నటించడం మరో విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం 400 కోట్ల కబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ కూలీ చిత్రానికే మంచి రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











