Rakul Preet Singh చేతిలో మిస్టేక్.. అసలేం జరిగిందంటే?
లాక్‌డౌన్ తర్వాత కొత్త హీరోల చిత్రాలు, చిన్న బడ్జెట్ చిత్రాల విడుదల జోరందుకొన్నది. ఇటీవల వచ్చిన చిన్న, మధ్య తరగతి బడ్జెట్ చిత్రాలు అద్భుతంగా తెరమీద ఫీల్ కలిగిస్తూ.. మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఎస్ఆర్ కల్యాణమండపం, శ్రీదేవి సోడా సెంటర్, సీటీ మార్ లాంటి చిత్రాల ఘన విజయాలు అందుకొన్నాయి. అలాంటి కోవలోనే యువ తారలు నటించిన మిస్టేక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఇలాంటి చిన్న చిత్రానికి ప్రమోషన్ అందించడానికి అగ్రతార రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చారు. ఇటీవల కాలంలో చిన్న చిత్రాలకు చిరంజీవి, వెంకటేష్ లాంటి పెద్ద నటులు తన వంతు సహకారాన్ని అందిస్తూ.. సినిమాలను ఆదుకొంటున్నారు.

యువ నటీనటులు అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టేక్ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు అందుకొన్నది. ఏఎస్పీ మీడియా హౌస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.2 గా ఈ చిత్రాన్ని నిర్మించింది. యువ దర్శకుడు సన్నీ కోమలపాటి దర్శకత్వం వహించారు.
దర్శక, నిర్మాతలు, యువ హీరో, హీరోయిన్ల కోరిక మేరకు రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకు సహకారం అందించడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మిస్టేక్ సినిమా మోషన్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా టీమ్‌కు మంచి విజయం దక్కాలి. అందరికీ ఆల్ ద బెస్ట్ అని రకుల్ ప్రీత్ సింగ్ విషెస్ తెలియజేశారు.

నటీనటులు: అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ, సమీర్, రాజా రవీంద్ర తదితరులు
సినిమాటోగ్రఫి: హరి జాస్తి
సంగీతం:- మణి జెన్న
డైలాగ్స్: శ్రీ హర్ష మండ
ఆర్ట్: రవి కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నిధి
నిర్మాత: అభినవ్ సర్ధార్
దర్శకత్వం: సన్నీ కోమలపాటి


Click it and Unblock the Notifications











