ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోను.. రామ్ చరణ్‌‌పై తండ్రి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఎంతో మంది సినీ నటునటులకు ఆయన అండగా నిలుస్తున్న సంగతి కూడా విధితమే. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గానూ మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందుకు తీసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.

రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటికీ 18 ఏళ్లు పూర్తైంది. 2007లో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ చిరుతతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ తొలి చిత్రంతోనే తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మెగాస్టార్ తనయుడు అంటే ఇలానే ఉండాలని, యాక్టింగ్ పరంగానూ దుమ్ములేపాడు. ఇప్పటికీ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చూపిన బాటలోనే పయనిస్తున్నారు.

Ram Charan Complete his 18 Years journey in TFI

చిరంజీవి హోదా, గౌరవ మర్యాదలను మరింత ఉన్నత స్థాయిలో ఉంచేలా రామ్ చరణ్ అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఎంతో ఓపికగ్గా, ప్రశాంతంగా, సినీ ప్రముఖుల పట్ల గౌరవంగా, తనకంటూ సీనియర్లతో క్రమశిక్షణగా, సినిమాల పట్ల ఏకాగ్రతగా ఉంటూ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇక రామ్ చరణ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదే సమయంలో చిరంజీవి రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ గా స్పందించారు.

చిరంజీవి రామ్ చరణ్ కెరీర్ గురించి తాజాగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. 'చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం చిరుత సినిమాతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటానను. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు.!' అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

ఇక రామ్ చరణ్ కెరీర్ విషయంలో చిరంజీవి తొలిసారిగా ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రామ్ చరణ్ కూడా తండ్రి గౌరవ మర్యాదల విషయంలో ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన స్థాయిని కిందకి రానివ్వకుండా మెదులుతానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
నెక్ట్స్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటు చిరంజీవి నెక్ట్స్ విశ్వంభర, మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే చిత్రంతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

More from Filmibeat

Read more about: ram charan chiranjeevi peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X