లెజెండ్ వెల్‌కమ్ ఇంత సాధారణంగా? అస్సలు బాలేదు.. రామ్ చరణ్‌పై సెటైర్స్

మ్యూజికల్ లెజెండ్‌ మణిశర్మకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు రామ్ చరణ్. ఈ మేరకు తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ తరఫున అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇంతకీ రామ్ చరణ్, మణిశర్మకు గ్రాండ్ వెల్‌కమ్ ఎందుకు చెప్పారు? ఈ సంగీత దిగ్గజం రామ్ చరణ్ కోసం ఏం చేయబోతున్నారు? వివరాల్లోకి పోతే..

 అప్పట్లో మణిశర్మ హంగామా..

అప్పట్లో మణిశర్మ హంగామా..

సంగీత దిగ్గజం మణిశర్మ అప్పట్లో తెగ హంగామా చేశారు. ఒకానొక సమయంలో ఏ సినిమా వచ్చినా దానికి మణిశర్మనే సంగీతం అందించి దాన్ని మ్యూజికల్ హిట్‌గా నిలిపేవారు. ఇలా ఎన్నో సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు మణిశర్మ. అయితే ఇలాంటి సంగీత దిగ్గజం ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కోసం రంగంలోకి దిగుతోంది.

మెగా 152.. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

మెగా 152.. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ సినిమా తర్వాత తన 152 వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జనవరి 2 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ సందర్భంగా మెగా 152 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అఫీషియల్‌గా ప్రకటించారు రామ్ చరణ్.

రంగంలోకి లెజెండ్‌.. గ్రాండ్ వెల్‌కమ్

చిరంజీవి కోసం మ్యూజికల్ లెజెండ్‌ మణిశర్మ రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ట్వీట్ చేసింది రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ. ఈ మేరకు ఈ విషయాన్ని చెబుతున్నందుకు తమకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ ట్వీట్ చేసింది కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్.

ఇంత సాధారణంగానా.. అస్సలు బాలేదు

ఇంత సాధారణంగానా.. అస్సలు బాలేదు

అయితే ఈ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు మ్యూజికల్ లెజెండ్‌ అనౌన్స్‌మెంట్ ఇంత సాధారణంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ''సుమారు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ మణిశర్మ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.. ఆ విషయాన్ని మీరు ఇంత సాధారణంగా ప్రకటన చెయ్యడం బాలేదు.. ఆ అనౌన్స్మెంట్ చాలా గ్రాండ్‌గా ఉండాలి'' అని అంటున్నారు.

 చిరంజీవి- మణిశర్మ కాంబో.. సంగీత ప్రియులకు ట్రీట్

చిరంజీవి- మణిశర్మ కాంబో.. సంగీత ప్రియులకు ట్రీట్

గతంలో చిరంజీవి- మణిశర్మ కాంబో ఎన్నో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇంద్ర, జై చిరంజీవ, చూడాలని ఉంది, మృగరాజు, అన్నయ్య, బావగారు బాగున్నారా, అంజి, ఇద్దరు మిత్రులు లాంటి ఎన్నో సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చి సంగీత ప్రియులను రంజింప జేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X