For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం.. సెన్సార్ అడ్డుకోవడంతో అక్కడ రిలీజ్ చేసేందుకు ప్లాన్

  By Manoj
  |

  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. టాలీవుడ్‌లో బెస్ట్ డైరెక్టర్ అనిపించుకోవడమే కాదు.. బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టాడు. అక్కడ కూడా సక్సెస్‌ఫుల్ మూవీస్ తీసి సత్తా చాటుకున్నాడు. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా సుపరిచితుడు అయిపోయారు. అప్పట్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో.. ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. దీనికి ఆయన వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ. తాజాగా ఈ సంచలన దర్శకుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం.? వివరాల్లోకి వెళితే..

  వివాదాస్పదం కాదంటూనే చేశాడు

  వివాదాస్పదం కాదంటూనే చేశాడు

  కొద్దిరోజులుగా రాంగోపాల్ రాజకీయాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తెరకెక్కించాడు. రెండు కులాలను ప్రధానంగా తీసుకుని చేసిన సినిమా కావడానికి తోడు, ఆయన విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్‌లో వివాదాస్పద సన్నివేశాలు ఉండడంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
   కేఏ పాల్ చేసిన పనితో ఆగిపోయింది

  కేఏ పాల్ చేసిన పనితో ఆగిపోయింది

  వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'కు ఇటీవల భారీ షాక్ తగిలింది. వాస్తవానికి ఈ సినిమాను గత వారమే విడుదల చేయాలి. కానీ, ఈ సినిమా విడుదలను ఆపాలని కేఏ పాల్‌తో పాటు పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత వారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సినిమాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది.

  వాళ్లు మాత్రం భారీ షాక్ ఇచ్చారు

  వాళ్లు మాత్రం భారీ షాక్ ఇచ్చారు

  సెన్సార్ బోర్డు మెంబర్లు ఈ సినిమాను చూసి సర్టిఫికెట్ జారీ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనికి అనుగుణంగా వాళ్లు సినిమాను చూశారు. కానీ, ఇందులో 90కి పైగా వివాదాస్పద సీన్లు ఉన్నాయని, ఈ కారణంగా సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కేంద్ర రివైజింగ్ కమిటీకి వెళ్లాలని చిత్ర యూనిట్‌కు చెప్పారు.

  రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం

  రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం

  తన సినిమాకు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే టైటిల్ మారుస్తానని వర్మ చెప్పినా సెన్సార్ వాళ్లు వినకపోవడం.. పైగా పరిస్థితి చేయి దాటిపోవడం వంటి వాటితో క్రేజీ డైరెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. తన సినిమాకు అనుమతులు రావడం లేదన్న కారణంతో దీన్ని డైరెక్టుగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడని తెలిసింది.

  న్యూడ్ సినిమాను కూడా అలాగే

  న్యూడ్ సినిమాను కూడా అలాగే

  రాంగోపాల్ వర్మ.. హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే సినిమాను తీసిన విషయం విధితమే. దీన్ని కూడా డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేశాడాయన. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆటంకాల మధ్య ఇది గత సంవత్సరం జనవరి 27న ఆన్‌లైన్‌లో విడుదలైంది. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

  ఊహించిన దాని కంటే ఎక్కువే

  ఊహించిన దాని కంటే ఎక్కువే

  ఈ సినిమా వల్ల వర్మ భారీగా ఆదాయం వచ్చింది. ఎంతో హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాకు రూ. 70 లక్షలు ఖర్చు అయిందట. అయితే, దీనికి దాదాపు రూ. 15 కోట్లు ఆదాయం వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో జీఎస్టీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇప్పుడు అదే తరహాలో ముందుకెళ్లాలని వర్మ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

  English summary
  Ram Gopal Varma aka RGV revealed that he has received numerous threat calls from unidentified people from foreign destinations after he announced his new film Kamma Rajyam Lo Kadapa Redlu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X